ETV Bharat / state

విషం తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి - మేడిపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య

ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు.. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని పెద్దల ముందు ఉంచారు. వారు అంగీకరించకపోవడం వల్ల కనీసం చావులోనైనా ఒక్కటవుదామని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి మృతి చెందగా... యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​ శివారు మేడిపల్లి ఠాణా పరిధిలో జరిగింది.

lovers suicide in mediapalli
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి
author img

By

Published : Jul 15, 2020, 8:44 AM IST

హైదరాబాద్​ శివారు మేడిపల్లి ఠాణా పరిధిలో విషాదం జరిగింది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట మేడిపల్లిలోని ఓ హోటల్​లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉప్పల్​ బజాజ్​ షోరూంలో పనిచేస్తున్న అజయ్​, మెట్రోమాల్​లో పనిచేస్తున్న పిర్జాదిగూడకు చెందిన శ్రావణి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పగా పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.

మేడపల్లిలోని ఓ హోటల్​ గదిలో విషం తాగారు. గమనించిన హోటల్​ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే శ్రావణి మృతి చెందింది. కొనఊపిరితో ఉన్న అజయ్​ను ఉప్పల్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.