ETV Bharat / state

సాయం చేయండి అంటూ కేటీఆర్​కు ట్వీట్లు

ట్విట్టర్​ వేదికగా మంత్రి కేటీఆర్​కు వినతులు వెల్లువెత్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలెదుర్కొంటోన్న ఇబ్బందులు పరిష్కరించాలని మంత్రిని కోరుతున్నారు.

lot of tweets to ktr from people for help
సాయం చేయండి అంటూ కేటీఆర్​కు ట్వీట్లు
author img

By

Published : Mar 25, 2020, 8:44 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలు మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్తున్నారు. సాయం చేయండి అంటూ ట్విట్టర్​ వేదికగా అభ్యర్థిస్తున్నారు. భువనగిరిలో నివాసం ఉంటోన్న ఓ వ్యక్తి తన తండ్రికి డయాలసిస్ కొరకు నిమ్స్, ఈఎస్ఐకు తీసుకెళ్లాలని.. ప్రజారవాణా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

డయల్ 100, డయల్ 108 కు కాల్ చేసినా ఎవరూ స్పందించడం లేదని, ప్రైవేటు వాహనాలేమీ అందుబాటులో లేవని వాపోయారు. స్పందించిన కేటీఆర్ సాయమందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు లాక్ డౌన్ కారణంగా రామంతపూర్ హాస్టల్​లోనే దివ్యాంగురాలైన తన చెల్లి ఉండిపోయిందని.. హాస్టల్ నిర్వాహకులు తిండి పెట్టకుండా ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ ఆఫీసు త్వరలో మీ అభ్యర్థనలను పరిష్కరిస్తుందని పౌరులకు అభయమిచ్చారు.

lot of tweets to ktr from people for help
సాయం చేయండి అంటూ కేటీఆర్​కు ట్వీట్లు

ఇవీచూడండి: కరీంనగర్​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.