ETV Bharat / state

గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో విజృంభిస్తోన్న కరోనా - corona in hyderabad

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో కరోనా ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. జంటనగరాల పరిధిలో గురువారం ఒక్కరోజే దాదాపు వెయ్యి కేసులు న‌మోదు కావ‌డం వల్ల ప్రజ‌ల్లో ఆందోళన నెలకొంది.

lot of corona cases has reported in hyderabad
గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో విజృంభిస్తోన్న కరోనా
author img

By

Published : Jul 3, 2020, 7:45 PM IST

భాగ్యనగర వాసుల్ని కొవిడ్​ గజగజ వణికిస్తోంది. గ్రేటర్​ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే దాదాపు వెయ్యి కేసులు న‌మోదు కావ‌డం వల్ల ప్రజ‌ల్లో ఆందోళన నెలకొంది. జ్యుడీషియల్ అకాడమీలో క‌రోనాతో అటెండర్ ప్రాణాలు కోల్పోయారు. కార్యాల‌యాన్ని శానిటైజ్ చేపి వారం రోజుల పాటు జ్యుడీషియల్ అకాడమీని మూసి వేశారు. హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ, ఆయ‌న కుమారుడు, మ‌న‌వ‌డు క‌రోనా నుంచి కోలుకుని శుక్రవారం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.

జీహెచ్ఎంసీ యూసుఫ్​గూడ సర్కిల్-19 పరిధిలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంబర్​పేట నియోజకవర్గ పరిధిలో 50 కేసులొచ్చాయి. అంబర్​పేట డివిజన్ పరిధిలో 22, కాచిగుడా డివిజన్ పరిధిలో 16, నల్లకుంట డివిజన్ పరిధిలో12 కేసులు కొత్తగా నమోదయ్యాయి. అంబర్​పేట పోలీస్ క్వార్టర్స్​లో ఉండే ముగ్గురు కానిస్టేబుల్స్​కి కరోనా సోకింది. అంబర్‌పేటలో నివాసముండే అమీర్‌పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్​కు చెందిన ఇద్దరు ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుళ్లకు కూడా కరోనా సోకింది. కాచిగూడకు చెందిన 69 ఏళ్ల వృద్ధురాలు కొవిడ్​తో చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. జీడీమెట్ల టీఎప్ఐఐసీ కాల‌నీకి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు క‌రోనాతో మృతి చెందారు.

ఇదీ చూడండి: 'ప్రజా ప్రతినిధులు మీరే ఇలా ఉంటే... సామాన్యులు ఎలా పాటిస్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.