ETV Bharat / state

LOCK DOWN: కఠినంగా లాక్‌డౌన్‌.. రోడ్లపై తగ్గిన జన సంచారం!

author img

By

Published : May 31, 2021, 3:28 PM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు మేరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ఆ తర్వాత గంట వరకు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిచ్చిన పోలీసులు.. ఆ తర్వాత నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

అమలవుతున్న లాక్‌డౌన్‌
అమలవుతున్న లాక్‌డౌన్‌

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళల సడలింపులో హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు పెరిగాయి. సాధారణ రోజుల్లాగానే పలు కూడళ్ల వద్ద వాహనాలు బారులుతీరాయి. అమీర్‌పేట, కోఠి, బేగంబజార్‌, చింతల్‌బస్తీ, సికింద్రాబాద్, కూకట్‌పల్లిలో వాహనాల రద్దీ ఏర్పడింది. లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించడంతో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. వ్యాపారస్థులు తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ఫలితంగా విక్రయాలు, కొనుగోళ్ల కోసం వచ్చే వాళ్లతో రహదారులు రద్దీగా కనిపించాయి.

ఎక్కడికక్కడ బారికేడ్లు..

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత బయటకు వచ్చిన వారిపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడిక్కడి బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. మహబూబాబాద్‌లో ఒంటిగంటకే వ్యాపార వాణిజ్య సముదాయాల మూతపడ్డాయి. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పలు సెంటర్లు, చెక్ పోస్టులను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.

ఆదిలాబాద్‌లోనూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్ డౌన్ పటిష్ఠంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండు తర్వాత తర్వాత రోడ్డు పైకి వాహనాలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దని ప్రభుత్వ చర్యలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: Sonu sood: తెలుగు రాష్ట్రాలకు సోనూసూద్ మరో సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.