ETV Bharat / state

కళ తప్పిన కోవెల.. అర్చకుల విలవిల... - రాష్ట్ర దేవాలయాలపై లాక్​డౌన్ ప్రభావం

కరోనా కారణంగా దేవాలయాలు వెలవెలబోతున్నాయి. ఆలయాల మీదే ఆధారపడి జీవిస్తున్న అర్చకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్థికంగా చితికిపోయి... ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మంత్రోశ్చరణ చేసిన గొంతుకలు ఇప్పుడు దేహీ అని అర్థించలేక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.

కళ తప్పిన కోవెల.. అర్చకుల విలవిల...
author img

By

Published : May 25, 2021, 1:51 PM IST

కరోనా కాలంలో అర్చకుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. లాక్​డౌన్ ప్రభావం ఆలయాలు, అర్చకులపై తీవ్రంగా పడుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అర్చన, హారతి, అభిషేకాలు, కల్యాణాలు, వ్రతాలు, తల నీలాల టికెట్లతో నిత్యం కలకలలాడిన ప్రాంగణాలు నేడు నిర్మానుశ్య వాతావరణంలో మూగబోతున్నాయి. దీంతో వీటిపైనే ఆధారపడిన అర్చకులు, వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరోవైపు శుభకార్యాలు, బయటి కార్యక్రమాలు లేక పూజారులను ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి.

లాక్​డౌన్ సడలింపు సమయంలో ఆలయాలు తెరిచే ఉంటున్నా.. ఆ సమయాన్ని నిత్యావసరాలు, పనుల చేసుకోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. పవిత్రమైన దినాల్లోనూ కరోనా కారణంగా భక్తులు ఆలయాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. హుండీ ఆదాయం 90 శాతం పడిపోయింది. అర్చకులకు హారతి పళ్లెంలో సమర్పించే కానుకలు కూడా అందడం లేదు.

కుటుంబ పోషణ కూడా చాలా భారంగా మారిందని పురోహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయే అర్చకులకు బీమా, ధీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తమ సమస్యలను గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.