ETV Bharat / state

కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్లపై లాక్‌డౌన్‌ ప్రభావం - telangana varthalu

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలతో రైతుబజార్లు, నిత్యావసరాలు, పూల దుకాణాలపై ప్రభావం పడింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో రాజధానిలో హడావుడి కనిపించింది. ఉదయాన్నే రైతుబజార్లు, దుకాణాల వద్ద రద్దీ ఉండగా... 10 గంటల తర్వాత పోలీసులు కట్టడి చేయడంతో అన్నీ మూతపడ్డాయి.

lockdown effect on markets
కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్లపై లాక్‌డౌన్‌ ప్రభావం
author img

By

Published : May 13, 2021, 4:58 AM IST

కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్లపై లాక్‌డౌన్‌ ప్రభావం

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సడలింపులు ఇచ్చినప్పటికీ... రైతుబజార్లు... పూలు, పండ్ల మార్కెట్లు ఉదయం పదింటికే మూతపడ్డాయి. లాక్‌డౌన్ తొలిరోజు ఉదయం నుంచే నగరంలో హడావుడి కనిపించింది. అన్ని రైతుబజార్లు, మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన లాక్‌డౌన్ ప్రకటనతో... వినియోగదారులు పది రోజులకు సరిపడా నిత్యావసరాలను కొనుక్కున్నారు. 4 గంటలే అనుమతివ్వడంతో పల్లెల నుంచి రావాల్సిన సరకు సమయానికి రాక... గిరాకీ లేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టోకు మార్కెట్‌ నుంచి సరకు తెచ్చుకుని బేరం మొదలు పెట్టేసరికే సమయం అయిపోతుందని వాపోతున్నారు.

బోసిపోయిన పూలమార్కెట్​

నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల రైతులతో కళకళలాడే గుడిమల్కాపూర్‌ పూలమార్కెట్ బోసిపోయింది. సరకు అమ్ముడుపోకపోవడంతో పూలు పారబోసి వెళ్లారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం మంచిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ ఒకటే మార్గమని చెబుతున్నారు. సామాజిక బాధ్యతతో అందరూ ఆంక్షలు పాటించాలని సూచిస్తున్నారు.

జంట నగరాల్లో వారాంతపు సంతలు కూడా ఎత్తేశారు. లాక్‌డౌన్ తొలిరోజు కావడంతో రాజధానిలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు.

ఇదీ చదవండి: ఉదయం ఉరుకులు పరుగులు.. మధ్యాహ్నం నుంచి గప్‌చుప్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.