ETV Bharat / state

ఉదయం ఉరుకులు పరుగులు.. మధ్యాహ్నం నుంచి గప్‌చుప్‌ - తెలంగాణ వార్తలు

బుధవారం తెల్లవారుతూనే జనం హడావిడిగా ఇంటి నుంచి బయలుదేరారు. కొందరు కూరగాయల మార్కెట్లకు, మరికొందరు నిత్యావసర వస్తువుల కోసం.. ఇంకొందరు సొంతూళ్లకు.. గడియారాల్లో, ఫోన్లలో సమయం చూసుకుంటూ.. ఎవరి తొందరి వారిదే.. ఎవరి అవసరాలు వారివే.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు.. నాలుగు గంటల పాటు ఉరుకులూ పరుగులూ.. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎక్కడివాళ్లు అక్కడే గప్‌చుప్‌. అప్పటివరకు కళకళలాడిన రహదారులు, బస్టాండ్లు కూడళ్లు, ఫ్లైఓవర్లు నిర్మానుష్యంగా మారిపోయాయి.  ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించేవారు.. మినహాయింపులు ఉన్నవారు, ఆసుపత్రులకు వెళ్లాల్సినవారే ప్రధానంగా రహదారులపై కనిపించారు.

lockdown effect in telangana
ఉదయం ఉరుకులు పరుగులు.. మధ్యాహ్నం నుంచి గప్‌చుప్‌
author img

By

Published : May 13, 2021, 3:51 AM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ తొలిరోజు ప్రభావం ఇది. ఈ నెల 21 వరకు రోజూ 20 గంటల పాటు విధించిన లాక్‌డౌన్‌ బుధవారం అమల్లోకి వచ్చింది. సడలింపు ఇచ్చిన సమయం తర్వాత.. హైదరాబాద్‌లోనూ, జిల్లాల్లోనూ దుకాణాలు మూతబడ్డాయి. ఇతర కార్యకలాపాలూ నిలిచిపోయాయి.

కొద్దిసేపే సడలింపులు
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ తొలి రోజు పకడ్బందీగా అమలైంది. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత రోజువారీ కార్యకలాపాలు క్రమేపీ నిలిచిపోవడంతో రాష్ట్రమంతటా ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. 10 గంటలకు లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటికీ హైదరాబాద్‌ సహా నగరాల్లో రోడ్లపై కొంత రద్దీ కనిపించింది. తొలి రోజు కావడంతో కొద్దిసేపు సడలింపు ఇచ్చిన పోలీసులు 11 గంటల తర్వాత.. నిబంధనల అమలుపై దృష్టి పెట్టారు.

తెరుచుకునే సమయానికే మూత
బార్లు.. వైన్స్‌లు.. వస్త్రాల దుకాణాలు.. ఎలక్ట్రానిక్‌ షాప్‌లు.. షాపింగ్‌ మాళ్లు.. సాధారణంగా ఉదయం 10- 11 గంటలకు గాని తెరుచుకోవు. బుధవారం మాత్రం ఉదయం 6 గంటల నుంచే వీటిలో అత్యధికం తెరుచుకున్నాయి. సాధారణంగా తెరుచుకునే సమయానికి మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఉదయం 10 గంటలకల్లా ఆఖరి ట్రిప్పు పూర్తి చేసుకుని డిపోలకు చేరాయి. రైళ్లు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగించాయి. కొవిడ్‌ టీకాలు, పరీక్షలు కొనసాగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు యథావిధిగా పనిచేశాయి. అత్యవసరంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు ప్రయాణించేవారికి ఆయా జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు పాస్‌లు జారీ చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో తొలిరోజు సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 700 పాస్‌లు జారీ అయ్యాయి.
సమీక్షించిన మంత్రులు
కొందరు మంత్రులు లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో అధికారులతో కలిసి పర్యటించారు. రహదారులు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంతి వేముల ప్రశాంత్‌రెడ్డి లాక్‌డౌన్‌ అమలుపై కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించారు.
ప్రయాణికుల ఇబ్బందులు
బస్సు ప్రయాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే పరిమితం కావడంతో పలుచోట్ల ప్రయాణికులు బస్టాండ్లలో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 6-7 గంటలకు బయల్దేరి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం వంటి నగరాలకు వెళ్లినవారు.. అక్కడి నుంచి ఇతర పట్టణాలు, గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బందిపడ్డారు. జేబీఎస్‌, ఆరాంఘర్‌ చౌరస్తా, ఉప్పల్‌లో బస్సు ప్రయాణికుల రద్దీ పెరిగింది. పలువురు ప్రైవేటు వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. అంతర్రాష్ట సర్వీసుల్ని ఆర్టీసీ నిలిపివేసింది. సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య కొంత పెరిగింది. కూరగాయల మార్కెట్లలో రద్దీ ఒక్కసారిగా ఏర్పడింది.
కావాల్సినవి కొనుగోలు
సడలింపు నాలుగు గంటలే ఇవ్వడంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో జనాలు ఉదయమే మార్కెట్లకు వెళ్లి కూరగాయలు, దుకాణాలకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్కెట్లు, దుకాణాలు మూతబడ్డాయి. జాతీయ రహదారుల్లో రద్దీ పెరిగింది. హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో పంతంగి టోల్‌ప్లాజ్‌ వద్ద ఇరువైపులా కలిపి ఉదయం 6-10 గంటల మధ్య సగటున రోజుకు 3,100 వాహనాలు వెళ్లేవి. బుధవారం ఆ సంఖ్య రెట్టింపై 6,550కి చేరింది. చాలామంది సొంత వాహనాలు, బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ మార్గంలో రోజుకు గరిష్ఠంగా 30వేలకు పైగా వాహనాలు వెళ్లేవి. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తర్వాత 21 వేలకు పరిమితమైంది.
స్వీయనియంత్రణ పాటించాలి: డీజీపీ
‘‘ఐజీల నుంచి ఎస్పీల వరకు లాక్‌డౌన్‌ అమలుపై స్పష్టత ఇచ్చాం. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా తిరిగి పర్యవేక్షించారు. ఆసుపత్రులకు, వాక్సిన్‌ కోసం వెళ్లేవారికి పోలీసులు సహకరించారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించడం అవసరం. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అవసరాల మేరకే ప్రజలు బయటికి రావాలి. ఫార్మా, ఐటీ, నిర్మాణ రంగ పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు నిర్వాహకులతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ సహకారం అందిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత, నిత్యావసర సరకుల రవాణా ప్రక్రియ సాఫీగా సాగేలా క్షేత్రస్థాయి పోలీస్‌ సిబ్బందికి అవగాహన కల్పించాం’’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

బారికేడ్లు.. వాహనాల తనిఖీలు

నగరాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీ చేశారు. ఎస్పీలు, కమిషనర్లు క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు తీరును పర్యవేక్షించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌లు ఆయా కమిషనరేట్ల పరిధిలో సంచరించి పోలీసులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 168, సైబరాబాద్‌లో 100, రాచకొండలో 46 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల సరిహద్దులతో పాటు అంతర్‌ జిల్లా సరిహద్దుల్లోనూ వందల సంఖ్యలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 60 వేల మంది పోలీసులు లాక్‌డౌన్‌ అమలు విధుల్లో పాలుపంచుకున్నారు. పలుచోట్ల అనుమతి లేకుండా ప్రయాణిస్తున్నవారికి కౌన్సెలింగ్‌ చేశారు. కొన్నిచోట్ల కొందరిపై కేసులు నమోదు చేశారు. నిత్యావసర సరకుల రవాణా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకొన్నారు. ఈ అంశంపై సమన్వయం చేసేందుకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారికి ఎలాంటి అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయి సిబ్బందిని ముందే అప్రమత్తం చేశారు.
*వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 18 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. సెంట్రల్‌, ఈస్ట్‌, వెస్ట్‌ జోన్ల పరిధిలో లాక్‌డౌన్‌ అమలుకు ప్రత్యేకంగా నలుగురు ఏసీపీలను, 8 మంది ఇన్‌స్పెక్టర్లను, 100 మంది ఏఆర్‌ సిబ్బందిని నియమించారు. గీసుకొండలో 20 మంది ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసి వాహనాల్ని జప్తు చేశారు. కమిషనర్‌ తరుణ్‌ జోషి వరంగల్‌, హన్మకొండ పట్టణాల్లో సంచరించి లాక్‌డౌన్‌ అమలుతీరును పర్యవేక్షించారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు.
* రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాలైన సుల్తానాబాద్‌, మంథని, ధర్మారం, గోదావరి వంతెనల వద్ద 10 తనిఖీ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 2వేల మంది సిబ్బంది లాక్‌డౌన్‌ బందోబస్తు నిర్వహించారు.
* సంగారెడ్డి జిల్లా పరిధిలో కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దుల్లో 4 చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. 800 మంది పోలీస్‌ సిబ్బంది లాక్‌డౌన్‌ విధుల్లో నిమగ్నమయ్యారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సంగారెడ్డి, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌లో పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు. ఉల్లంఘనులపై 25 వరకు పెట్టీ కేసులు నమోదు చేశారు.

9 తరవాత.. పట్టాలెక్కలే..కూత పెట్టలే

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌ నగరంలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి 8.45 వరకే మెట్రో రైళ్లు తిరిగాయి. చివరి ట్రిప్పు తరవాత అవి డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల తరవాత రైళ్లు నాగోలు మెట్రో డిపోలో ఇలా ఒకే చోటికి చేరి కనిపించాయి.

యథావిధిగా వ్యాక్సినేషన్‌, కరోనా పరీక్షలు
లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి వెసులుబాటు ఉండటంతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, పరీక్షలు యథావిధిగా కొనసాగాయి. అయితే మంగళవారం వరకున్న పరిస్థితులతో పోలిస్తే.. బుధవారం వ్యాక్సినేషన్‌, పరీక్షలకు వచ్చినవారి సంఖ్య తగ్గింది.

ఇదీ చదవండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.