ETV Bharat / state

ఆక్సిజన్​ లేక కరోనా బాధితులు చనిపోతున్నారు: భట్టి - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. రెండో విడత కరోనా ఉద్ధృతిని నిలువరించేందుకు తెలంగాణలో కొన్ని వారాలైనా లాక్‌డౌన్‌ విధించాలని డిమాండ్​ చేశారు.

bhatti
భట్టి విక్రమార్క
author img

By

Published : Apr 30, 2021, 7:24 PM IST

రెండో విడత కరోనా ఉద్ధృతిని నిలువరించేందుకు తెలంగాణలో కొన్ని వారాలైనా లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో.. ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు, బెడ్లు కొరత లేకుండా చూడాలని కోరారు. బెడ్లు ఉంటే మందులుండడం లేదు... మందులుంటే అక్కడ బెడ్లు ఉండడం లేదని విమర్శించారు. కేసీఆర్ తీరువల్లే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జూమ్‌ యాప్‌ ద్వారా మీడియా సమావేశం నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో కరోనా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏడాది కిందటే రాహుల్‌ గాంధీ, తాను కొవిడ్‌పై హెచ్చరించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రెండోవిడత పెద్ద విపత్తుగా మారిందని.. దాని నుంచి ప్రజలను రక్షించుకోడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆక్సిజన్ లేకపోవడం వల్లే కరోనా బాధితులు వైద్యుల కళ్లముందే చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన అన్ని అంశాలను పక్కన పెట్టి.. ప్రజలను కాపాడటానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: పదవీ విరమణ చేసిన 14ఏళ్లకు ఆమెకు పింఛన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.