ETV Bharat / state

Mango Farmers: లాక్​ డౌన్​ ప్రభావం.. మామిడి రైతులకు తీరని నష్టం

కరోనా రెండో దశ మామిడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లాక్​ డౌన్ ప్రభావంతో రవాణా, మార్కెటింగ్ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పంట తీసుకెళ్లి మార్కెట్‌లో అమ్ముకుందామంటే.. పోలీసుల నిబంధనలు అడ్డు వస్తున్నాయి. దీనితో పాటు అకాల వర్షాలతో కాయలు రాలి నేలపాలవుతున్నాయి. కొవిడ్ పుణ్యమాని వరసగా రెండో ఏటా నష్టాలు చవిచూస్తున్న తమను సర్కారు ఆదుకోవాలంటున్న మామిడి రైతులతో ఈటీవీ భారత్ ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి.

lock down  effect on mango farmers in state
లాక్‌డౌన్ ప్రభావంతో మామిడి రైతులకు తీరని కష్టాలు
author img

By

Published : May 27, 2021, 10:18 AM IST

ఫలం దక్కలేదు.. మామిడి రైతుల ఆశలు నీరుగారిపోయాయి. కరోనా రెండో వేవ్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అన్నదాతపై పిడుగు పడ్డట్లైంది. తొలి కోత సమయంలో కాస్త లాభాలు దక్కినా.. ఆ తర్వాత లాక్‌డౌన్ ప్రభావంతో పంట తీసుకెళ్లి మార్కెట్‌లో అమ్ముకుందామంటే.. పోలీసుల నిబంధనలు ఊరి సరిహద్దులు దాటనివ్వడం లేదు.

లాక్​ డౌన్​ ప్రభావం

అకాల వర్షాలకు మామిడి కాయలు రాలి నేలపాలవుతున్నాయి. ఉన్న కాయకోసి మార్కెట్‌కు తరలించి అమ్ముకుందామంటే కూలీల కొరత, రవాణా వసతి మృగ్యంగా మారింది. సరే అవన్నీ అధిగమించి హైదరాబాద్‌ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ తీసుకెళ్లి అమ్మినా కనీసం వాహనం అద్దె రావడం లేదు. అదనపు ఖర్చెందుకని తోటల్లో పంట వదిలేస్తుండటంతో అవి చెట్లపైనే పక్వం చెంది కింద రాలి కుళ్లిపోతున్నాయి. సాధారణంగా తోటలో అడుగు పెట్టడానికి ఫలం సువాసన వెదజల్లాల్సిన చోట కుళ్లు వాసన వస్తుంది. కొవిడ్ పుణ్యమాని వరసగా రెండో ఏటా నష్టాలు చవిచూస్తున్న తమను సర్కారు ఆదుకోవాలని మామిడి రైతులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: అందుబాటులోకి సాధారణ, ఆక్సిజన్‌ పడకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.