Loan apps agents: అవసరమే వారికి పెట్టుబడి... డబ్బులు కావాలని ఒక్క క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఎంతో కొంత వడ్డీ తీసుకుంటారు. సక్రమంగా కట్టామా సరేసరి. లేకపోతే ఇక అంతే సంగతులు. మన ఫోటో పెట్టి ఇతను డబ్బులు తీసుకున్నాడు తిరిగి ఇవ్వడం లేదు.. మోసం చేస్తున్నాడు.. అంటూ బంధువులకు, మిత్రులకు, తెలిసిన వారికి, పరిచయం ఉన్న వారికి అందరికీ మేసేజీలు పెడతారు. ఆ తర్వాత తెలిసిన వారికి ఫోన్లు చేసి ఇష్టారీతిగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అయితే... తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించినా.. వడ్డీ పెరిగిందని, ఛార్జీలు కట్టాలని వేధిస్తారు. లేకపోతే బంధుమిత్రులకు మేసేజీ పెడతామని బెదిరిస్తారు.
తాజాగా హైదరాబాద్ ఫతేనగర్‌లో ఉంటున్న ఓం బాబు అనే వ్యక్తి ఇంటికి సోమవారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు పోలీస్ యూనిఫాం వేసుకున్నారు. యాప్ ద్వారా డబ్బు తీసుకున్నారని తిరిగి చెల్లించాలని, లేకపోతే కేసు పెడతామని బెదిరించి వెళ్లిపోయారు. అనంతరం ఓం బాబు బేగంపేటలో ఉంటున్న తన యజమాని వద్దకు వెళ్లాడు. విషయాన్ని వివరించాడు. తానూ ఏ రుణం తీసుకోకపోయినా ఇలా వచ్చారంటూ చెప్పాడు. ఓం బాబు యజమాని వారికి ఫోన్ చేసి ఏ స్టేషన్‌కు రమ్మంటారంటూ అడగ్గా... స్టేషన్‌కు కాదు.. ఆఫీస్‌కు రమ్మన్నారు. వారికి మరోసారి ఫోన్ చేసి మేం అసలు అప్పే తీసుకోలేదని చెప్పారు. అవన్నీ మాకు తెలీదు. మా మేనేజర్ చెప్పాడు.. ఏదైనా ఉంటే మా మేనేజర్‌తో మాట్లాడండి అంటూ దురుసుగా సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఈ వ్యవహారంపై ఓం బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓం బాబు ఇప్పటి వరకు 12 మంది అమ్మాయిలను ఇతర రాష్ట్రాల వారికి విక్రయించాడు. ఒక బాలికపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి.. అంటూ హిందీలో ఓం బాబు స్నేహితులు, పరిచయస్తులకు 15 రోజుల క్రితం మెసేజీ పంపించారు యాప్ నిర్వాహకులు. అనంతరం వేర్వేరు ఫోన్ నంబర్లతో ఓం బాబుకు వరుసగా ఫోన్లు వస్తున్నాయి. నంబర్లను బ్లాక్ చేస్తున్నా... వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సోమవారం ఇద్దరు వ్యక్తులు రావడంతో ఓం బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు చైనీయులు నిర్వహిస్తున్న రుణ యాప్ సంస్థలు బాధితుల ఇళ్లవద్దకు తమ ఏజెంట్లను పంపబోరని పోలీసులు తెలిపారు. రుణ యాప్‌ల సందేశాలు, ఓం బాబుతో మాట్లాడిన వ్యక్తులకు సంబంధం ఉందా? అన్నది పరిశీలిస్తున్నామని వివరించారు. ఓం బాబు ఇప్పటి వరకూ 12 మంది అమ్మాయిలను ఇతర రాష్ట్రాల వారికి విక్రయించాడు. ఒక బాలికపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి.
ఇవీ చూడండి: పాలమూరు పచ్చబడితే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్