ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు అనుమతి : సీఎం కేసీఆర్ - రాష్ట్రవ్యాప్తంగా అనుమతి

'రేపట్నుంచి తెరుచుకోనున్న మద్యం దుకాణాలు'

author img

By

Published : May 5, 2020, 11:03 PM IST

Updated : May 6, 2020, 12:24 AM IST

21:18 May 05

రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు అనుమతి : సీఎం కేసీఆర్

'రేపట్నుంచి తెరుచుకోనున్న మద్యం దుకాణాలు'

రేపట్నుంచి మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రేపటి నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుస్తామని ప్రకటించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. పక్క రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచినందున.. మన రాష్ట్రం వారు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రం కాక ముందే రేపటి నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. 

పేదలకు 11 శాతం... బడాబాబులకు 16 శాతం

మద్యం ధరలు 16 శాతం పెంచుతామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం పెంచుతున్నట్లు వివరించారు. రెడ్‌జోన్లలోనూ మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. బార్లు, పబ్బులు మాత్రం మూసి ఉంచుతామని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం, మాస్క్‌ నిబంధనలు పాటించాలని సీఎం కోరారు.  

రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు

Last Updated : May 6, 2020, 12:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.