New Year Liquor Sales: నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 254 కోట్లు విలువైన మద్యాన్ని గోదాముల నుంచి దుకాణదారులు తీసుకెళ్లారు. ఇవాళ అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాల్లో, 1గంటకు బార్లలో మద్యం విక్రయాలకు ఆబ్కారీ శాఖ అనుమతిచ్చింది. నూతన సంవత్సరం అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారీ ఎత్తున మద్యం నిలువలను దుకాణదారులు సిద్ధం చేసుకున్నారు.
ఐదు రోజుల్లో 895.55 కోట్ల విలువైన మద్యాన్ని గోదాముల నుంచి తరలించి సిద్ధం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇదే ఐదు రోజులలో కేవలం 753.99కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడుపోయింది. అంటే ఈ ఏడాది ఇప్పటికే 150 కోట్ల విలువైన మద్యం అదనంగా దుకాణదారులు, బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు నిల్వలు ఉంచుకున్నాయి.
2021 డిసెంబర్లో దాదాపు 3050 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోవుగా ఈ డిసెంబర్లో 30వ తేదీ వరకు 3160.34 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. ఈవేళ మరో 250 కోట్లకు పైగా విలువైన మద్యం గోదాముల నుంచి దుకాణాలకు, బార్ అండ్ రెస్టారెంట్లకు చేరే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: