ETV Bharat / state

హైదరాబాద్​లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

author img

By

Published : Apr 14, 2021, 6:27 AM IST

Updated : Apr 14, 2021, 6:44 AM IST

నిన్నటివరకు వరకు ఉక్కపోతతో సతమతమైన జనానికి కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణం మేఘావృతమై చల్లని గాలులు వీయగా... ఈ ఉదయం నుంచి అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

hyderabad rains, light rains in hyderabad
హైదరాబాద్ నగరంలో వానలు, హైదరాబాద్​లో చిరు జల్లులు

హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మంగళవారం నుంచి వాతావరణం మేఘావృతమై చల్లని గాలులు వీయగా.. ఈ ఉదయం నుంచి అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. నగరంలో పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్​పేట, ఎస్ఆర్​నగర్, కర్మన్​ఘాట్, చంపాపేట్, ఐఎస్ సదన్, మీర్​పేట్, సంతోష్​ నగర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్‌, బోరబండ, రహమత్‌నగర్‌లో ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కోఠి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్​నగర్​, లక్ష్మారెడ్డి పాలెంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది.

hyderabad rains, light rains in hyderabad
నగరంలోని అక్కడక్కడా వర్షాలు

నగరంలో కురుస్తోన్న ఈ అకాల వర్షాల పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురుస్తాయని.. యాదాద్రి భువనగరి, ములుగు, వరంగల్, పర్వతగిరి వంటి ప్రాంతాల్లో 82 మి.మీ వరకు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, వికారాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, పెద్దపల్లి వంటి ప్రాంతాల్లో 25 నుంచి 30 మి.మీల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

హైదరాబాద్​ నగరంలో చిరు జల్లులు

ఇదీ చదవండి: నేడు హాలియా బహిరంగ సభకు సీఎం కేసీఆర్​

Last Updated : Apr 14, 2021, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.