ETV Bharat / state

Liger Movie Exhibitors Strike : రోడ్డెక్కిన ఎగ్జిబిటర్లు.. మరోసారి తెరపైకి 'లైగర్' వివాదం

Liger Movie Exhibitors Strike : 'లైగర్‌' వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ చిత్ర ఎగ్జిబిటర్లు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన తమకు రూ.9 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టాన్ని 6 నెలల్లో తీరుస్తానని హామీ ఇచ్చిన పూరీ జగన్నాథ్ మాట నిలబెట్టుకోవాలని కోరారు. అప్పటి వరకు అగ్ర హీరోలెవరూ పూరీకి కాల్షీట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

Liger Movie Exhibitors Strike
Liger Movie Exhibitors Strike
author img

By

Published : May 12, 2023, 7:16 PM IST

Updated : May 12, 2023, 8:00 PM IST

Liger Movie Exhibitors Strike : దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు అగ్ర హీరోలెవరూ కాల్షీట్లు ఇవ్వొద్దని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. పూరీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందడంతో ఆ చిత్రాన్ని విడుదల చేసిన తమకు సుమారు రూ.9 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎగ్జిబిటర్లను ఆదుకుంటానని, వారికి జరిగిన నష్టాన్ని 6 నెలల్లో తీరుస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారని గుర్తు చేస్తూ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద 'లైగర్ బాధితుల సంఘం' పేరుతో రిలే నిరాహార దీక్షలకు దిగారు.

ఈ సందర్భంగా లైగర్ చిత్ర విషయంలో బాధిత ఎగ్జిబిటర్లను పూరీ జగన్నాథ్ ఆదుకొని మాట నిలబెట్టుకోవాలని కోరారు. అంతవరకు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ సహా ఇతర అగ్ర హీరోలెవరూ పూరీ జగన్నాథ్‌కు కాల్షీట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిటర్ల ఆందోళనను తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. నిర్మాత ఛార్మి దృష్టికి తీసుకెళ్లింది. ఫిల్మ్ ఛాంబర్ సమాచారంతో స్పందించిన ఛార్మి.. విషయమంతా తనకు తెలుసని, ఎగ్జిబిటర్లందరికీ మేలు జరిగేలా కృషి చేస్తున్నామని మెయిల్ ద్వారా సమాచారం పంపింది.

''పూరీ జగన్నాథ్‌ గారు మేము చేతులెత్తి చెబుతున్నాం. మేమంతా చాలా కష్టాల్లో ఉన్నాం. మీరిచ్చిన మాట ప్రకారం 6 నెలలు వెయిట్‌ చేశాం. అయినా మీరు స్పందించట్లేదు. మాకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వట్లేదు. అందుకే ఈరోజు మరోసారి రోడ్డెక్కాల్సి వచ్చింది. మీపై మాకు ఎలాంటి కోపం లేదు. మేము నష్టపోయిన డబ్బులను మాకిచ్చి ఆదుకోండి. చిన్న హీరోలు, పెద్ద హీరోలు ఎవరూ పూరీ జగన్నాథ్‌కు కాల్షీట్లు ఇవ్వకండి. మీరు డేట్స్‌ ఇస్తే మాకు న్యాయం జరగదు.'' - ఎగ్జిబిటర్లు

రోడ్డెక్కిన ఎగ్జిబిటర్లు.. మరోసారి తెరపైకి 'లైగర్' వివాదం

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. భారీ అంచనాల నడుమ గతేడాది ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులతో పాటు అభిమానులనూ మెప్పించలేకపోయింది. మొదటి రోజు నుంచే నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. అటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఇటు కథానాయకుడు విజయ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఘనమైన ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఇవీ చూడండి..

పోలీసులను ఆశ్రయించిన పూరి జగన్నాథ్​.. ఆ డిస్ట్రిబ్యూటర్స్ బెదిరిస్తున్నారని

'లైగర్'​ ఫ్లాప్​ నుంచి విలువైన పాఠాన్ని నేర్చుకున్నా: విజయ్​ దేవరకొండ

Last Updated : May 12, 2023, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.