ETV Bharat / state

ప్రీతి మృతిపై గవర్నర్ సీరియస్​.. సమగ్ర విచారణ జరపాలని యూనివర్సిటీ వీసీకి లేఖ - Tamilisai reaction on Preeti death

Governor office response to Preeti death: వైద్య విద్యార్థి ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని కాళోజి వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతికి గవర్నర్ తమిళిసై ఆదేశాలతో రాజ్‌భవన్‌ కార్యాలయం లేఖ రాశారు. వైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్, వేధింపుల తరహా ఘటనలు జరిగినపుడు తీసుకునే చర్యలకు సంబంధించిన ఎస్​ఓపీలపై నివేదిక కోరారు. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటలు.. వైద్యకళాశాలలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరు విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించారు.

Governor office response to Preeti death

author img

By

Published : Feb 28, 2023, 4:32 PM IST

Updated : Feb 28, 2023, 4:47 PM IST

Governor office response to Preeti death: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతీ ఆత్మహత్యకు సంబంధించి గవర్నర్ కార్యాలయం ఘాటుగా స్పందించింది. మొదట ఆమె.. ఆరోగ్యం సరిగా లేదని తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించారని కాళోజి హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై గవర్నర్ ఆదేశాల మేరకు కాళోజి వర్శిటీ వీసీకి లేఖ పంపినట్టు రాజ్ భవన్ ప్రకటించింది.

ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని వీసీకి ఆదేశించారు. ఆమె మరణాన్ని తీవ్రంగా పరిగణించాలని పేర్కొంది. ముఖ్యంగా ప్రీతిని నిమ్స్​కి తరలించాలన్న నిర్ణయం వల్ల విలువైన సమయాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. అందుకు బదులుగా నిపుణులైన వైద్యులను, ఆధునిక పరికరాలను ఎంజీఎంకే తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దోషులను శిక్షించేందుకు అన్ని కోణాల్లో విచారించాలని లేఖలో పేర్కొన్నారు.

Raj Bhavan letter to VC koliji Medical University: ర్యాగింగ్, వేధింపుల వంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తీసుకునే చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని వీసీకి స్ఫష్టం చేసింది. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటలపై నివేదిక కోరారు. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వాటి పనితీరుపై నివేదిక కోరిన రాజ్‌భవన్.. వైద్య కళాశాలల్లో తప్పక యాంటి ర్యాగింగ్ చట్టాలను అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆయా కళాశాలల్లో సైకియాట్రిక్ విభాగం అధిపతులతో విద్యార్థుల కౌన్సిలింగ్ సెల్స్​ని ఏర్పాటు చేయాలని కోరింది.

MLC kavitha letter to Preeti parents: మరోవైపు ప్రీతి మృతిపట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులకు లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పేర్కొన్న ఆమె.. ఇలా జరగటం జీర్ణించుకోలేక పోతున్నానని లేఖలో పేర్కొన్నారు. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడని విచారం వ్యక్తం చేశారు.ఆమె కుటుంబానికి ప్రభుత్వం, బీఆర్​ఎస్​ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆమె మృతికి కారణమైన దోషులను ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు.

KTR reaction to Preeti death: ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని​ మండిపడ్డారు. మృతిరాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్​.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

భారీ బందోబస్తు మధ్య ముగిసిన ప్రీతి అంత్యక్రియలు.. విషాదంలో గ్రామస్థులు

నా కుమార్తెది ఆత్మహత్య కాదు.. హత్యే.. : ప్రీతి తండ్రి

పరీక్షలో 94 వచ్చాయని.. ట్రాఫిక్​ పోలీసులతో గొడవ పడిన యువకుడు

Last Updated : Feb 28, 2023, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.