ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో అలిపిరికి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాల ఆవరణలో గత సంవత్సరం నుంచి చిరుతలు సంచరిస్తున్నాయి. విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న కుక్కలపై దాడులు చేయడం.. స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. చిరుతల సంచారంతో విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో పాటుగా.. ఉద్యోగులు ఆందళవ్యక్తం చేయడంతో వర్సిటీ అధికారులు, అటవీ అధికారుల సమన్వయంతో కలిసి చిరుతలను పట్టుకునేందుకు విశ్వవిద్యాలయంలో బోను ఏర్పాటు చేశారు.
ఈ రోజు బోనులో చిరుత చిక్కింది. విశ్వవిద్యాలయ ఆవరణంలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు రెండు రోజుల క్రితం రెండు బోనులు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీసీ బంగ్లా వద్ద ఏర్పాటుచేసిన బోనులో రెండు సంవత్సరాలు వయసు గల చిరుత పిల్ల చిక్కింది. అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఆ చిరుతను శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చిరుతను బాకరాపేట అడవుల్లోకి వదిలిపెట్టారు.
ఇటీవల ఎనిమిది అడుగుల ఎత్తు, ఫెన్సింగ్ ఉన్న వీసీ బంగ్లాలోకి ప్రవేశించి పెంపుడు కుక్కను సైతం చంపి తీసుకెళ్లడంతో విశ్వవిద్యాలయ ఆవరణలో ఉంటున్న ఉద్యోగులు, వందలాది మంది విద్యార్థులు భయాందోళనకు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులు వసతి గృహాలను ఖాళీ చేయడానికి సిద్ధమవడంతో అధికారులు స్పందించి బోన్లు ఏర్పాటు చేయగా ఓ చిరుత చిక్కింది. మరో చిరుత కోసం వేట కొనసాగుతోంది. మిగిలిన ఆ ఒక్క చిరుతను సైతం పట్టుకోవాలని ఉద్యోగులు అటవీ అధికారులను కోరుతున్నారు.
ఇవీ చదవండి: