Left-wing unions protest: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రవాప్తంగా జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించాయి.
జవాబు పత్రాలను ఉచితంగా పునఃపరిశీలించాలని, ఫీజు లేకుండా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు జరపాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాం, ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సీఎం స్పందించి, విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని వారు కోరారు. మరోవైపు ఎన్‌ఎస్‌యూఐ కూడా సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: Telangana CMO on Inter results : ఇంటర్ ఫలితాలపై సీఎంవో స్పందన.. పరిణామాలపై ఆరా!