తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు సంతాపసభకు వామపక్ష నేతలు హాజరవుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీపీఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతాప సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్‌పాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. వీరితో పాటు ఇతర వామపక్ష పార్టీల నాయకులు, తెలంగాణ సాయుధ పోరాటయోధులు, స్వాతంత్ర సమరయోధులు పాల్గొంటున్నారని చాడ వెల్లడించారు.