రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు తగ్గించాలని వామపక్షాలు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించాయి. సికింద్రాబాద్ హెచ్‌పీసీఎల్(HPCL) రీజనల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(tammineni veerabhadram), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి(chada venkat reddy) పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎడాపెడా పెంచుతూ... ప్రజల నడ్డివిరుస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే పెట్రో ధరలు తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. హెచ్‌పీసీఎల్(HPCL) కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం కార్పొరేట్లకు మేలు చేస్తూ పేదలపై పన్నుల భారం మోపుతోందని చాడ ఆరోపించారు.
ఇదీ చూడండి: Kidnap: నవవధువు కిడ్నాప్... ఆ తర్వాత ఏమైందో తెలుసా..!