ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ నేతన్న ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ భగవాన్ లాల్‌ను కలిశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణలో బాధిత కుటుంబీకులు పలు సమస్యలు విన్నవించారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఐకాస చైర్మన్ సురేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు లేవని చెబుతున్న కేటీఆర్... మిగతా జిల్లాల్లో చేనేత ఆత్మహత్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
ఇవీ చూడండి: మేడ్చల్ జిల్లాలో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం