Various States Leaders Of Met CM KCR: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన వివిధ రాష్ట్రాల నేతలు కలిశారు. వారిలో తమిళనాడు వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ ఉన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌కు నేతలు అభినందనలు తెలిపారు. ఎస్సీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ వారికి వివరించారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
త్వరలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో దళిత సదస్సు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో దళిత్ సదస్సు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎస్సీ పథకాల గురించి తెలుసుకున్నామని వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ అన్నారు.ఎస్సీలకు ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావట్లేదని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు గొప్ప పథకమని తిరుమావళవన్ తెలియజేశారు.
ఇవీ చదవండి: మునుగోడు ఉపఎన్నికలో భాజపాకు సరైన జవాబిస్తాం: జగదీశ్‌రెడ్డి
'నా భార్య కూడా మీలా తిట్టదు.. ఇలా లవ్ లెటర్స్ పంపదు'.. గవర్నర్‌కు సీఎం కౌంటర్