CM KCR and KTR Condolence on Gaddar Death : ప్రముఖ ప్రజా గాయకుడు, ప్రజాయుద్ధనౌకగా పేరు గాంచిన గద్దర్(77) ఆదివారం అనారోగంతో మృతి చెందారు. దీంతో ఉద్యమ గళం మోగబోయింది. ప్రజాగాయకుడి మరణవార్త విన్న నాయకులు అతనికి సంతాపం తెలియజేస్తున్నారు. మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల, సత్యవతి రాథోడ్ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. గద్దర్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజాగాయకుడని కొనియాడారు. తన ఆటపాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యం రగిలించారని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గద్దర్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. సభలో మంత్రి కేటీఆర్ సంతాప ప్రకటన చేశారు.
Harish Rao Respond on Gaddar Death : గద్దర్ మృతిపట్ల తెలిపిన మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. ఆయన ఇక లేరన్నది చాలా బాధాకరమని అన్నారు. ఉద్యమంలో తన గళంతో కోట్ల మందిని ఉత్తేజపరిచారని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Rahul Gandi Tweet about Gaddar Death : గద్దర్ మృతి పట్ల సంతాపం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. అతని మరణం తనని ఎంతో బాధించిందని ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. ఖమ్మం సభలో గద్దర్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. గద్దర్ చూపిన బాటలో ముందుకు సాగుతామని అన్నారు. అటు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ట్విటర్లో తన సానుభూతి వ్యక్తం చేశారు.
-
Saddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all. pic.twitter.com/IlHcV6pObs
">Saddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2023
His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all. pic.twitter.com/IlHcV6pObsSaddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2023
His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all. pic.twitter.com/IlHcV6pObs
PCC Leader Revanth Reddy Condolence on Gaddar Death : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రజా గాయిని విమలక్క, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అపోలో ఆస్పత్రి సందర్శించి అతని మృతి పట్ల సంతాపం తెలియజేశారు. విమలక్క అతని భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమైయ్యారు.
Talasani Srinivas Yadav Condolence on Gaddar Death : మంత్రి తలసాని శ్రీనివాస్ సంతాపం తెలియజేసి.. అతని మృతి చాలా బాధాకరమని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గద్దర్ మృతి అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటని అన్నారు. అతని ప్రసంగాలు, పాటలు ప్రజల్లో ఎంతో స్ఫూర్తి నింపాయని గుర్తు చేశారు.
Gaddar Passed Away : ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత
MP Komati Reddy Venkat Reddy Response on Gaddar Death : గద్దర్ మృతి పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌తో మంచి అనుబంధం ఏర్పడిందని.. తన పోరాటానికి అయన స్ఫూర్తి అన్నారు.ప్రజా సమస్యలపై ఆయన పోరాటం అజరామరమని తనదైన పాటలతో ఎంతోమందిని ఉత్తేజ పరిచారన్నారు. తెలంగాణ ఉద్యమ గళం అయిన గద్దర్ స్మృతిలో.. ఆయనకు నివాళులు అర్పిస్తుట్లు తెలిపారు.
Gangula Kamalakar Response on Gaddar Death : ప్రముఖ కవి గద్దర్ మృతి పట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్‌గా పేరొందిన విఠల్ కవిగా, గాయకుడిగా తన ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రజలలో చైతన్యం నింపారని.. సంతాప సందేశంలో పేర్కొన్నారు. గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని తెలిపారు. ప్రసిద్ధ ప్రజాగాయకులు గద్దర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని మంత్రి ప్రార్థిస్తున్నట్లు మంత్రి గంగుల వెల్లడించారు.
Etela Rajendar Condolence on Gaddar Death : పాటల యుద్ధనౌక పేరు పొందిన గద్దర్ మరణం పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని తెలిపారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని.. వారు భౌతికంగా లేకపోయినా వారి పాట శాశ్వతంగా బతికే ఉంటుందని ఈటల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Devender Goud Reaction : మాజీ రాజ్య సభ సభ్యుడు తూళ్ల దేవేందర్ గౌడ్ గద్దర్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. ఫ్యూడల్ వ్యవస్థ మీద తిరుగుబాటు చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రతి ఒక్కరికి పోరాట స్ఫూర్తిని నింపారని అన్నారు. వ్యక్తిగతంగా తనకి అత్యంత సన్నిహితులని విచారించారు.
Sharmila Reaction on Gaddar Death : గద్దర్ మరణంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం తెలిపారు. ప్రజాపోరాటాల మహా శిఖరం ఒరిగిపోయిందని తీవ్ర ద్రిగ్భాంతికి గురైయ్యారు. సలసల మండే గుండెమంటల రాగంతో వలవల జారే కన్నీళ్ళ తాళంతో పాడిన ప్రతి గేయం అమరం. ఓ పోరాటయోధుడా అందుకో సలాం అంటు సానుభూతి తెలిపారు.
Movie Actors Reactions on Gaddar Death : సినీ ప్రముఖలు తన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. కథానాయకుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు. తన పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దన్న ఇక లేరనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగుజేసిందని అన్నారు. డైరెక్టర్ శంకర్, ఆర్ నారాయణ మూర్తి, సాయి చంద్.. పలువురు సంతాపం తెలిపారు.
Gaddar's son-in-law reaction : ఐసీయూలోనూ పాటలు పడటం ఆపలేదు : గద్దర్ అల్లుడు
కేఏ పాల్ పార్టీ అభ్యర్థిగా గద్దర్, మునుగోడు నుంచి పోటీ
RRR Farmers Protest : 'పెద్దల భూములు కోల్పోకుండా.. పేదల భూములు కోల్పోయేలా RRR అలైన్మెంట్'