LDF INDIA Presentation 2023 in Hyderabad : హైదరాబాద్ వేదికగా ఆక్వా రంగానికి సంబంధించి.. ఎల్‌డీఎఫ్ ఇండియా పేరిట జాతీయ ప్రదర్శన సందడిగా దర్శనమిస్తోంది. ప్రముఖ ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా మూడు రోజుల పాటు నిర్వహించే.. ఈ ప్రదర్శనను జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎల్‌ఎన్ మూర్తి, నాబార్డు సీజీఎం సుశీల చింతల ప్రారంభించారు. నాణ్యమైన ఉత్పత్తుల సరఫరా చేయడమే లక్ష్యంగా.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తులు పదర్శిస్తుండటంతో తిలకించేందుకు అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, మహిళలు పోటీపడుతున్నారు.
Live Stock Exhibitions in Telangana : తెలంగాణ ప్రభుత్వం, మత్స్య శాఖ, ఎంఎస్‌ఎంఈ సహకారంతో ఈ ప్రదర్శన జరుగుతోందని నరసింహమూర్తి తెలిపారు. మిశ్రమ చేపల పెంపకం, రీసైక్లింగ్ ఆక్వా సిస్టం, ఆర్నమెంటల్, మైరైన్ ఫిష్ వంటి విధానాల్లో ఉత్పత్తి బాగా పెంపొందించేందుకు ఎన్‌ఎఫ్‌డీబీ ప్రోత్సహిస్తోందన్నారు. పాడి పరిశ్రమ, మత్స్య సంపద, పర్యావరణ వ్యవస్థల భవిష్యత్తు దృష్ట్యా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భిన్న రీతుల్లో యంత్రాలు ప్రదర్శిస్తున్నట‌్లు తెలిపారు. అంకుర సంస్థల ఆధ్వర్యంలో 100పైగా స్టాళ్లు కొలువుతీరాయని ఆయన పేర్కొన్నారు.
Fish Food Festival in Telangana : రాష్ట్రంలో మూడ్రోజుల పాటు 'ఫిష్ ఫుడ్ ఫెస్టివల్'
100 Stalls Fishries Presentation in Hyderabad : దేశంలో మత్స్య రంగం సన్‌రైజ్ సెక్టార్‌గా కేంద్రం గుర్తించిందని.. ఐదేళ్లల్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకం కింద రూ.20 వేల 500 కోట్లు వెచ్చించిందని ప్రైవేటు సంస్థ వ్యవస్థాపకులు మురిప తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో కూడిన 65 పథకాలు అమల్లో ఉన్నాయన్నారు. నీతి ఆయోగ్ గణాంకాల(NITI Ayog Report) ప్రకారం కోవిడ్ సమయంలో 8.5 శాతం వృద్ధి సాధించడం ద్వారా మత్స్య రంగం రికార్డు సృష్టించిందన్నారు. దేశంలో మత్స్య సంపదలో చేపలు, రొయ్యలు, పీతల ఉత్పత్తికి కొదవ లేకపోయినా.. నాణ్యత దెబ్బతినకుండా వినియోగదారులకు అందుబాటులో ఉన్న సవాళ్లు అధిగమించేందుకు ఈ సదస్సు ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.
"సముద్ర ఉత్పత్తుల మీద గత మూడు సంవత్సరాల్లో 174 లక్షల టన్నలు ఉత్పత్తి చేశాం. ప్రధాని మోదీ 2025కి 225 లక్షల టన్నుల ఉత్పత్తికి లక్ష్యం ఇచ్చారు. దీన్ని మేము సాధిస్తామని అనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఇలాంటి ఫెస్టివల్స్ ఏర్పాటు చేయనున్నాం. ఈ రంగంలో మరింత ముందుకు వెళ్తాం."-నరసింహమూర్తి, ఎన్‌ఎఫ్‌డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
LDF INDIA-2023 in Hyderabad : చేపలు, రొయ్యల, పీతల సాగు, వ్యాధుల నియంత్రణ, దాణా, ఔషధాలు, పెంపకం, సోర్సింగ్, టెక్నాలజీ, ప్యాకింగ్, లాజిస్టిక్స్, కోల్డ్ చైన్, రిటైల్, ఈ-టైల్ వంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నారు. వ్యవసాయ అనుబంధంగా ఆయా రంగాల అభివృద్ధి కోసం నాబార్డు పెద్ద ఎత్తున రీఫైనాన్స్ చేస్తోంది. కానీ, అవి సరిగా అందకపోవడం, సద్వినియోగం చేసుకోకపోవడంతో వెనుకబడి పోవాల్సి వస్తుంది. యువత, మహిళలు ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేందుకు ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో తొలిసారిగా పోస్ట్ హార్వెస్టింగ్ అనంతరం ఇబ్బందులు సులభంగా అధిగమించేందుకు అవకాశాలు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చామని నాబార్డు వెల్లడించింది.
Crabs and Fishes Exhibition in Hyderabad : దేశంలో మత్స్య పరిశ్రమ 47.19 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించింది. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. సముద్ర ఉత్పత్తులు విదేశీ ఎగుమతుల ద్వారా ఏకంగా రూ.63,960 కోట్లు ఆదాయం భారత్ ఆర్జించింది. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వా కల్చర్(Aqua Culture) ఉత్పత్తిదారు కావడంతో ఈ రంగం అభివృద్ధిలో వేగవంతంగా సాగుతోంది.
Art gallery exhibition in Hyderabad : 'విద్యార్థుల ప్రతిభకు.. ఈ చిత్రాలే ప్రత్యేక సాక్ష్యాలు'
Gastric Problem To Fish : చేపకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం.. ఈదడంలో ఇబ్బంది.. CT స్కాన్ చేసి చూస్తే..
Chepa Mandu Distribution : అస్తమా పేషెంట్స్‌కు అలర్ట్.. మరో రెండ్రోజుల్లో చేప ప్రసాదం పంపిణీ