సాయానికి ఎవరు అర్హులు?
ఈనెల 12వ తేదీ వరకు 7 ఏళ్లలోపు స్టాండింగ్‌తోపాటు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుండాలి. ఆలిండియా బార్ అసోసియేషన్ పరీక్షలు రాసి ఉండాలి.
సీనియర్ న్యాయవాదుల నుంచి నెలవారీ మొత్తాలను అందుకుని ఉండరాదు.
దంపతుల్లో ఎవరూ ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. నెలకు రూ.15 వేల కంటే తక్కువ ఆదాయం ఉండాలి.
పదవీవిరమణ చేశాక నమోదుచేసుకుని ఉండరాదు.
అర్హులైనవారు నిర్దేశిత ఫారంతో బార్ అసోసియేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరో రూ.25 కోట్లు కేటాయించాలి: వెంకటయాదవ్
న్యాయవాదులను ఆదుకోవడానికి రూ.25 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కింది కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపట్టడానికి అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం మరో రూ.25 కోట్లు మంజూరు చేయాలని బార్ కౌన్సిల్ సభ్యుడు చెలికాని వెంకటయాదవ్ కోరారు.
ఇవీ చూడండి: కరోనా పురుషుల్లోనే అధికమట!