ETV Bharat / state

లాసెట్, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..! - పీజీఈసెట్​ నోటిఫికేషన్​ విడుదల

Law set Entrance Test Released: తెలంగాణలో లాసెట్​, పీజీఎల్​ సెట్​ షెడ్యూల్​ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అంతే కాకుండా ఇంజినీరింగ్​ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్​కు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వాటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Lawset and PGL set schedule released
Lawset and PGL set schedule released
author img

By

Published : Feb 27, 2023, 5:46 PM IST

Updated : Feb 27, 2023, 8:25 PM IST

Law set Entrance Test Released: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 2న ప్రారంభం కానుంది. మార్చి 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. లాసెట్‌కు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 600, ఇతరులు రూ. 900 పీజీఎల్‌ సెట్‌కు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 900, ఇతరులు రూ.1100 ఫీజు చెల్లించాలని కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు.

ఆలస్య రుసుము రూ. 500 చెల్లించి ఏప్రిల్ 12 వరకు, రూ.1000లతో ఏప్రిల్ 19 వరకు, 2వేల రూపాయలతో ఏప్రిల్ 26 వరకు, రూ. 4వేలతో మే 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను మే 4 నుంచి 10 వరకు సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. మే 16 నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 25న లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 29న ప్రాథమిక కీ విడుదల చేసి 31వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు కన్వీనర్ తెలిపారు.

Telangana E SET 2023: పాలిటెక్నిక్​ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్​కు మార్చి 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 1న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు. మార్చి 2 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆలస్య రుసుము రూ.500 మే 2 వరకు, రూ.2వేల 500.. మే 12 వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చునని తెలిపారు. మే 15 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈసెట్ పరీక్ష జరగనుంది.

EAM SET 2023 notification release: ఇప్పటికే ఎంసెట్ 2023 నోటిఫికేషన్​ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎంసెట్​ ఆన్​లైన్​ అఫ్లికేషన్లను మార్చి 3 నుంచి మొదలుకానుంది. దరఖాస్తుల​ స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్​ 10వ తేదీగా ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఏప్రిల్​ 12 నుంచి 14 వరకు అవకాశం ఇచ్చింది.

రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్​ 15గా ప్రకటించింది. రూ.500లతో అపరాధ రుసుముతో ఏప్రిల్​ 20వరకు గడువు పెంచింది. రూ.2500లతో అపరాధ రుసుముతో ఏప్రిల్ ​25వరకు గడువు ఇవ్వనున్నారు. 30వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్​ టికెట్లు డౌన్​లోడ్​ చేసుకోవడానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 27, 2023, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.