హైదరాబాద్ పాతబస్తీ బాయ్స్ టౌన్ ఐటీఐలో సోలార్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభమైంది. సెల్కో స్కిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమాలోని బాయ్స్ టౌన్ విద్య సంస్థ ప్రాంగణంలో ఆరంభించారు. రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ జాయింట్ డైరెక్టర్ నగేష్, డాక్టర్ అలెగ్జాండర్లు కలిసి ల్యాబ్‌ను ప్రారంభించారు.
పాతబస్తీలోని ప్రజలకు బాయ్స్ టౌన్ విద్యాసంస్థ ద్వారా మాంట్ ఫోర్డ్ బ్రదర్స్ అందిస్తున్న సేవలను నగేష్ కొనియాడారు. బాయ్స్టౌన్ ఇంకా అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహించి పాతబస్తీ అభివృద్ధికి పాటు పడాలని ఆకాక్షించారు.
ఐటీఐ ప్రిన్సిపల్ బ్రదర్ మారెడ్డి, గెబ్రియల్ బ్రదర్స్ హైదరాబాద్ ప్రొవిన్షియల్ సుపిరియర్ అండ్ ఛైర్మన్ రెవరెండ్ బ్రదర్, బాలశౌరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెవరెండ్ బ్రదర్ థామస్, డాక్టర్ జోసెఫ్ స్టాన్లీ, బాయ్స్టౌన్ విద్యాసంస్థ డైరెక్టర్ బ్రదర్ ఏసు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 997 కరోనా కేసులు, 4 మరణాలు