Land Regularisation Applications: ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న స్థలాల క్రమబద్ధీకరణ కోసం దాదాపు లక్షన్నర వరకు దరఖాస్తులు వచ్చాయి. 58, 59 ఉత్తర్వులకు లోబడి క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం గత నెల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. మీసేవా కేంద్రాల ద్వారా నుంచి ఫిబ్రవరి 21 నుంచి దరఖాస్తు చేసుకుంటున్నారు. 2014 జూన్ రెండో తేదీ కటాఫ్‌గా క్రమబద్ధీకరణ చేయనున్నారు. 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఆపై విస్తీర్ణం ఉన్న స్థలాలను నిర్ణీత రుసుముతో క్రమబద్ధీకరణ చేస్తారు.
ఇందుకోసం ఇప్పటి వరకు 1,47,268 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అందులో ఉచితంగా క్రమబద్ధీకరణ కోసం 58వ జీఓ కింద 87,520 దరఖాస్తులు రాగా... 59వ జీఓ కింద క్రమబద్ధీకరణ కోసం 59,748 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు సమర్పించే గడువు రేపటితో ముగియనుంది.