ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదర్‌గూడలోని సెయింట్ పాల్ ఎదురుగా ఉన్న సురభి అపార్ట్మెంట్లో బి.కె.కమలాదేవి, భర్త బి.కె.నరేష్ సింగ్ నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కమలాదేవి.. తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ