హైదరాబాద్ హయత్‌నగర్‌లోని తారమతిపేటకు చెందిన మేరమ్మ అనే మహిళ ప్రసవం కోసం వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లింది. పండగరోజు కావడం వల్ల వైద్యులు లేరని సిబ్బందే పలు వైద్య పరీక్షలు చేశారు. అంతా బాగుందని.. రెండు మూడు రోజుల తర్వాత రావాలని సూచించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎల్బీనగర్లో రోడ్డుపక్కనే ప్రసవం జరిగిందని భర్త వాపోయాడు.
చలించిన స్థానికులు...
రోడ్డుపైనే మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళను చూసి స్థానికులు చలించిపోయారు. అంబులెన్స్‌కి ఫోన్ చేసి సమాచారమిచ్చి కోఠి ఆసుపత్రికి తరలించారు. పండగ రోజు కావటం... ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడ సిబ్బంది లేకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: అంధుడైనా సడలని ఆత్మవిశ్వాసం.. ఎందరికో ఆదర్శం