రాష్ట్ర ప్రభుత్వం దినసరి కూలీలకు శుభవార్త అందించింది. దినసరి కూలీలకు కనీస కూలీని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజువారీ కూలీలకు కనీస కూలీ రూ. 300 నుంచి రూ. 390కి పెంచింది.
పూర్తి స్థాయి కాంటిన్జెంట్ వర్కర్లు/కన్సాలిడేటెడ్ పే వర్కర్లకు నెలసరి వేతనం రూ. 8000 నుంచి రూ. 10,400కు పెంచింది. పార్ట్ టైమ్ వర్కర్లకు నెలసరి వేతనం రూ. 4000 నుంచి రూ. 5200కు పెంచినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. జూన్ నుంచే ఈ కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: KTR:సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది..