కరోనా సమయంలో విశేష సేవలు అందించిన సిబ్బందికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాలం చెల్లిన పథకాలు, చట్టాలనే కేంద్రం కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసి కార్మికులను కేంద్రం రోడ్డున పడేసిందని అసెంబ్లీ వ్యాఖ్యానించారు. బస్తీ దవాఖానాలతో పేదల చెంతకే ఆస్పత్రులు వచ్చాయని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
అధ్యక్ష్య.. మన సీఎం గత ఏడు సంవత్సరాల్లో భారతదేశంలోనే చరిత్ర సృష్టించిండు. ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తుండు. బస్తీ దవాఖానాలు తెరిచిండు. సాగునీరు, తాగునీరు, కరెంట్, ఆసరా పింఛన్లు... ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్‌ది అధ్యక్ష్య. మన ప్రియతమ ముఖ్యమంత్రిని ఒక్కసారి ప్రధానమంత్రిని చేయాలి అధ్యక్ష్య. మన సీఎం గనగ పీఎం అయితే భారతదేశ చరిత్ర మారిపోవడం ఖాయం అధ్యక్ష్య.
--- మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
తన శాఖ పద్దును సభ్యులంతా ఆమోదించాలని మంత్రి మల్లారెడ్డి కోరగానే... సభ్యుల మోహల్లో నవ్వులు పూశాయి.
ఇదీ చూడండి : శాసనసభలో పలు బిల్లులకు ఆమోదం