ETV Bharat / state

Kunamneni Latest Comments : 'ప్రజా సమస్యలపై ఆగస్టు 7న కలెక్టరేట్లను ముట్టడిస్తాం'

Kunamneni Comments on PM Modi : ప్రతి పక్షాలు కూటమిగా ఏర్పడి 'ఇండియా' అని పేరు పెట్టడంలో సీపీఐ ముఖ్య పాత్ర ఉందని ఆ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని విమర్శించిన పార్టీలన్నీ ఎన్డీఏ కూటమిలో చేరాయని ఎద్దేవా చేశారు. సేవ్ ఆర్టీసీ పేరుతో రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టనున్నారని తెలిపారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 19, 2023, 7:44 PM IST

Kunamneni Sambasiva Rao Fire on BJP : 'ఇండియా' పేరుతో ప్రతిపక్షాల కూటమి ఏర్పడటం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. ఇండియా కూటమి ఏర్పడటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైనదని అన్నారు. మునుగోడులో బీజేపీని కమ్యూనిస్టులు నిలవరించడం వల్ల బీఆర్​ఎస్​కి మేలు జరిగిందని చెప్పారు. కమ్యూనిస్టులు బీఆర్​ఎస్​కు మద్దతు ఇవ్వకపోతే ప్రమాదంలో పడేదన్నారు. సంతోష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్​లో ఆయన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీకి 'ఇండియా' కూటమిని విమర్శించడం సరికాదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని విమర్శించిన పార్టీలన్నీ ఎన్డీఏ కూటమిలో చేరాయని ఎద్దేవా చేశారు.

CPI National Leader Chada Venkat Reddy Latest Comments : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ప్రధాని నరేంద్ర మోదీకి ఏర్పడిందని ఆరోపణలు చేశారు. 'సేవ్ ఆర్టీసీ' పేరుతో ఈ నెల 26 నుంచి 31 వరకు అన్ని డిపోల్లోను రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 7న ప్రజా సమస్యలపై అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐ బలమైన స్థానాలను గుర్తించామని.. ఆ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్య విలువలకు పాతరవేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలపైన ఈడీ, సీబీఐ దాడులు చేస్తూ.. భయాందోళనలకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. అధికారాన్ని కోల్పోతామనే భయంతో పోటాపోటీగా ఎన్డీఏ సమావేశం పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్షాల కూటమి పేరు 'INDIA'.. ముంబయిలో నెక్స్ట్ భేటీ.. 11 మందితో కమిటీ

"ఇండియా ఏర్పడటంలో ప్రతిపక్ష పార్టీలో కన్నా సీపీఐది ప్రధానంగా ఉన్నది. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అపహేళన చేస్తున్నారు. ఆయన అయితే 38 పార్టీలతో సమావేశాన్ని పెట్టుకున్నారు. ఆ పార్టీ వాళ్లు తప్ప మిగిలిన వారు సభలు పెట్టుకుంటే.. స్వార్థం కోసం పెట్టుకున్నామని విమర్శిస్తారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయం మోదీకి కలిగింది. ఆయన ఓటమిని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు. 'ఇండియా' అనేది గెలవాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆర్టీసీ మరింత సమస్యగా మారింది. ఆర్టీసీని రక్షించుకోవాలనే కార్యక్రమాలను నిర్ణయించుకున్నాం. ఉద్యోగుల్లో భద్రత కల్పించేందుకు పోరాడుతాం." - కునంనేని సాంబశివ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ప్రజా సమస్యలపై ఆగస్టు 7న కలెక్టరేట్లను ముట్టడిస్తాం: సీపీఐ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.