Kunamaneni Sambasivarao fires on modi: ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు అన్ని ధ్వంసం అవుతున్నాయని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఇప్పటివరకు ఈడీ 3వేల దాడులు చేసిందని, వాటిలో నిరూపితమైంది ఒకటి లేదని.. రాజకీయ కక్షతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డిలపై కుట్రపూరిత దాడులు జరుగుతున్నాయని తెలిపారు. భాజపా చేసే దాడులు ఎందుకు బీజేపీ నాయకులు మీద జరగడం తెలియదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను లొంగతీసుకొనేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. సంతోష్‌కు నోటీస్ ఇస్తే బండి సంజయ్ ఎందుకు బాధని ప్రశ్నించారు. 41ఏ ప్రకారం.. అధికారులకు ప్రశ్నించే అధికారం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ముందుగా సిట్ అధికారులు విచారించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: