ETV Bharat / state

ఆమె కోసమే సతీష్​ను స్నేహితుడు చంపేశాడా!? - దారుణ హత్య

ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఓ కంపెనీని స్థాపించి.. ఆదర్శంగా ఉంటున్నారు. ఇంతలోనే అందులో ఒకరు హత్యకు గురయ్యారు. స్నేహితుడు చేతిలోనే సతీష్ హతమయ్యాడు. ఈ హత్యకు కారణమేంటంటే...

కూకట్‌పల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
author img

By

Published : Aug 30, 2019, 7:18 PM IST

కూకట్‌పల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య

కూకట్‌పల్లిలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన మైలా సతీష్ కుమార్ మూసాపేటలోని ఆంజనేయ నగర్​లో నివాసం ఉంటున్నాడు. కేపీహెచ్​పీలో ఐటి స్లేట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. సతీష్​కు కోరుకొండ సైనిక స్కూలులో చదువుతున్న సమయంలో భీమవరానికి చెందిన హేమంత్​తో స్నేహం ఏర్పడింది. సతీష్ కంపెనీ ఏర్పాటు చేసిన తరువాత తన చిన్ననాటి స్నేహితుడు హేమంత్​కు ఉద్యోగం ఇవ్వటమే కాకుండా వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నాడు.

కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఆర్థిక పరమైన విషయాల్లో మనస్పర్థలు ఉన్నట్లుగా మృతుని స్నేహితులు పోలీసులకు తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఇంటి నుంచి ఆఫీసుకి వెళ్ళిన సతీష్ ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి తిరిగివస్తున్నానని చెప్పాడు. ఇంటికి తిరిగిరాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అతడి భార్య ప్రశాంతి 29వ తేదీన కేపీహెచ్​పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన భర్త, హేమంత్ ఇంటికి ఏమైనా వెళ్ళాడెమోనని కేపీహెచ్​పీ కాలనీ 7వ ఫేజ్​లోని అతడి ఇంటికి ప్రశాంతి బంధువులతో కలిసి వెళ్లి చూసింది. తాళం వేసి ఉన్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కాలనీ వాసుల సమక్షంలో ఇంటి తాళాలు పగులగొట్టి వెళ్లి చూడగా సతీష్ మృత దేహం లభించింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య హేమంత్ చేసి ఉంటాడన్న అనుమానంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సతీష్, హేమంత్ల మధ్య గొడవకు వారి కంపెనీలో పనిచేసే ఓ యువతి కారణమని తెలుస్తోంది. ఆ యునతి సతీష్​తో సన్నిహితంగా ఉండడం హేమంత్​కు నచ్చేదికాదని సమాచారం. ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఒక్క ఎకరానికైనా కాళేశ్వరం నీరిచ్చారా..?: భట్టి విక్రమార్క

New Delhi, Aug 30 (ANI): Taking forward Prime Minister Narendra Modi's 'Swachh Bharat' campaign, India's first plogger Ripu Daman Bevli has organised a run to make the country litter-free. The runners will collect garbage on their way while participating in this initiative to drive the goal behind the run of inculcating a habit of enhancing fitness and keeping the environment clean. The run will begin from Kochi on September 5 and will end at the India gate in New Delhi on November 2 with a symbolic plogger's run. The run will pass through 50 big cities across India, covering 1000 kilometres with pit-stops in Mumbai, Hyderabad and Kolkata. The run will be supported by R|Elan, a fabric manufacturing company, in association with Ripu Daman. Plogging is a combination of jogging with picking up litter. R|Elan(tm), a next-gen fabrics company manufactures specially engineered fibres and yarns using the cutting-edge technological expertise, state-of-the-art research and development and the robust testing systems.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.