ETV Bharat / state

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే కృష్ణారావు - ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తాజావార్తలు

హైదరాబాద్​ కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... శనివారం ఉదయం డివిజన్​ అసోసియేషన్​ సభ్యులతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

KukatPally MLA Madhavaram Krishna Rao  held a teleconference with the members of the Division Association on Saturday morning
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే కృష్ణారావు
author img

By

Published : Jul 11, 2020, 7:46 PM IST

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. శనివారం కూకట్​పల్లిలో డివిజన్​ అసోసియేషన్​ సభ్యులతో ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. స్వయంగా కలుసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతాయనే.. టెలికాన్ఫరెన్స్​ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్​ సభ్యులతో పాటు... జీహెచ్​ఎంసీ అధికారులు, జలమండలి అధికారులు కూడా పాల్గొన్నారు.

సమస్యలపై ఎమ్మెల్యేకు వివరణ

అసోసియేషన్​ సభ్యులు వారికి ఉన్న సమస్యలను... ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలలో కూడా వైరస్​ విపరీతంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుని శానిటేషన్​ చేపట్టాలని కోరారు. అలాగే చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజ్​, పార్కు, నీటి సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.

పరిష్కరిస్తామని హామీ

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే... జీహెచ్​ఎంసీ అధికారులతో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు అసోసియేషన్​ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఎమ్మెల్యే సూచనలు

కాలనీలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అసోసియేషన్​ సభ్యులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు.. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. వీలైనంత వరకు బయటకు వెళ్లడం తగ్గిస్తే మంచిదని వివరించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తనకు ఫోన్​ చేసి చెప్పవచ్చని... అసోసియేషన్​ సభ్యులకు చెప్పారు. వైరస్​కు మందు లేదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కేపీహెచ్​బీ డివిజన్​ కార్పొరేటర్​ మందడి శ్రీనివాసరావు, కూకట్​పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్​ సతీశ్​అరోరా, జీహెచ్​ఎంసీ అధికారులు, అసోసియేషన్​ సభ్యులు, జలమండలి అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.