కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కూలీలు... పేదలకు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నారు. సనత్‌నగర్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్‌లోని పేదలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
తన వంతు సాయంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌కు వంద బస్తాల బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్లప్పుడూ అండగా ఉంటానని... ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసినట్లు ఎమ్మెల్యే అన్నారు.
ఇవీ చూడండి: కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!