పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్... ఇవాళ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నగరంలో కొత్త నిర్మించిన లింక్రోడ్లతో పాటు మరిన్ని కొన్ని ప్రాంతాల్లో నిర్మించనున్న లింక్‌రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. నందిహిల్స్‌లో రోడ్ నెంబర్ 45 నుంచి ఓల్డ్ ముంబయి రోడ్, రూ. 15.54 కోట్లతో నిర్మించిన లెదర్ పార్క్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
అనంతరం రూ. 23.10 కోట్ల వ్యయంతో లెదర్ పార్క్ సమీపంలో నిర్మించనున్న వీయూపీ బ్రిడ్జ్ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఓల్డ్ ముంబయి నుంచి ఈఎస్‌సీఐ టూ డీపీసీ ఖాజగూడ వద్ద రూ. 19.51 కోట్లతో నిర్మించిన లింక్‌రోడ్‌ను ప్రారంభించి అటు నుంచి రూ. 7.75 కోట్లతో మియాపూర్, నిజాంపేట్ లింక్ రోడ్‌ను ఆయన ప్రారంభించనున్నారు.