ETV Bharat / state

నాలుగేళ్లలో ఇదంతా జరగడం గర్వకారణం: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంతో - అమెజాన్ భాగస్వామ్యం విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్​కు భారీ పెట్టుబడి ప్రకటించిన అమెజాన్ ఇండియాను ఉద్దేశించి.. నాలుగేళ్లలో తమ బంధం మరింత బలోపేతమైందని అన్నారు.

KTR tweeted about Amazon investments
నాలుగేళ్లలో ఇదంతా జరగడం గర్వకారణం: కేటీఆర్
author img

By

Published : Nov 6, 2020, 9:17 PM IST

తెలంగాణ రాష్ట్రంతో - అమెజాన్ భాగస్వామ్యం క్రమంగా బలపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్​కు భారీ పెట్టుబడి ప్రకటించిన అమెజాన్ ఇండియాను ఉద్దేశించి.. నాలుగేళ్లలో తమ బంధం మరింత బలోపేతమైందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్​తో పాటు.. ఆసియాలోనే అతిపెద్ద ఫెసిలిటీ సెంటర్ సైతం హైదరాబాద్​లోనే నెలకొల్పిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇదంతా నాలుగేళ్లలో జరగడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ సెక్టార్ వృద్ధిని చూపే చార్టును కేటీఆర్ పంచుకున్నారు. ఆల్ ఇండియా ఆఫీస్ ట్రాన్సక్షన్లలో రాష్ట్రం 2015 లో 6వ స్థానం నుంచి 2019 లో రెండో స్థానానికి ఎగబాకిందని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా ఆఫీస్ స్పేస్ విస్తరణలో 2013 సంవత్సరంలో 0.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి.. నాలుగింతలు పెరిగి 12.8 మిలియన్ చదరపు అడుగుల్లో కంపెనీలు విస్తరించాయని కేటీఆర్ తెలిపారు. కరోనా పరిస్థితుల్లోనూ అద్దెలు తటస్థంగా ఉండటం రాష్ట్రానికే చెల్లిందని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

  • For those that are unaware Amazon’s largest campus in the world (3 Mn Sq Ft) & their largest FC in Asia are also located in Hyderabad 👇 All this in last 4 years

    A reflection of how well the partnership of Amazon & Telangana have grown from strength to strength 👍 pic.twitter.com/gjITAMhMmY

    — KTR (@KTRTRS) November 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.