హైదరాబాద్‌కే మకుటాయమానంగా మారనున్న దుర్గం చెరువు వంతెన పనులు పూర్తయ్యాయి. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ తీగల వంతెన అందాలు మంత్రముగ్ధులను చేయనున్నాయి. దీనికి సంబంధించిన తాజా దృశ్యాలను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
రాష్ట్రాభివృద్ధిలో మౌలిక వసతులు అత్యంత కీలకమన్న కేటీఆర్... ఇందుకోసం బడ్జెట్లో 60 శాతం వెచ్చిస్తునట్టు వల్లడించారు. దుర్గంచెరువు వంతెనను అద్భుతంగా తీర్చిదిద్దిన ఇంజినీరింగ్ బృందాన్ని మంత్రి అభినందించారు.
ఇవీచూడండి: మైనర్‌పై దాష్టీకం: మత్తు మందు కలిపి అత్యాచారం... భార్య సహకారం