KTR Tweet on Veg and Nonveg Markets: రాష్ట్రవ్యాప్తంగా సమీకృత మార్కెట్‌లు శరవేగంగా ఏర్పాటవుతున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా మార్కెట్‌లలో శాకాహారంతోపాటు మాంసాహారం లభిస్తోందని వివరించారు. పురపాలక శాఖ నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఖమ్మం, నారాయణపేట, భువనగిరిలో అందుబాటులోకి వచ్చిన మార్కెట్ల ఫోటోలను షేర్ చేశారు. మార్కెట్ల నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు, పురపాలక ఛైర్మన్లను కేటీఆర్ ట్విటర్లో అభినందించారు.
-
These pics👇are from Narayanpet town and Bhuvanagiri town
— KTR (@KTRBRS) February 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
My compliments to MLAs @SRReddyTRS Garu and @PaillaShekarTRS Garu and the Municipal Chairmans 👏 pic.twitter.com/Il1DZ9bTP7
">These pics👇are from Narayanpet town and Bhuvanagiri town
— KTR (@KTRBRS) February 14, 2023
My compliments to MLAs @SRReddyTRS Garu and @PaillaShekarTRS Garu and the Municipal Chairmans 👏 pic.twitter.com/Il1DZ9bTP7These pics👇are from Narayanpet town and Bhuvanagiri town
— KTR (@KTRBRS) February 14, 2023
My compliments to MLAs @SRReddyTRS Garu and @PaillaShekarTRS Garu and the Municipal Chairmans 👏 pic.twitter.com/Il1DZ9bTP7
CM KCR on Veg and Nonveg Markets : మొన్నటి వరకు జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల అంశంపై చర్చ జరిగింది. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్రవ్యాప్తంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని కేసీఆర్ శాసనసభలో చెప్పారు. భూమిపై కూరగాయలు పెట్టి విక్రయిస్తే బ్యాక్టీరియా ముప్పు ఉంటుందన్నారు. మోండా మార్కెట్ మాదిరిగా.. రాష్ట్రంలో మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అధునాతన మార్కెట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
'హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవి. గతంలో శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు ఏర్పడ్డాయి. నిజాం కాలం నాటి మోండా మార్కెట్ శాస్త్రీయతతో ఏర్పాటైంది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా మార్కెట్లు లేవు. హైదరాబాద్‌లో మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించాం. సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టాం.'- సీఎం కేసీఆర్
అధునాతనమైన మార్కెట్‌లు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. నియోజకవర్గాల్లో మార్కెట్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల అధికారులు చూసి స్ఫూర్తి పొందుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: