ETV Bharat / state

KTR on Central Government : 'అచ్చేదిన్‌’లో 25 శాతం ఖాళీలు.. మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా

KTR Fires On BJP: కేంద్ర ప్రభుత్వంపై.. కేటీఆర్‌ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కొత్త శిఖరాన్ని చేరుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం ముగిసే సమయానికి దాదాపు 11 శాతం ఉండగా.. అదే మోదీ హయాంలో ఆ సంఖ్య దాదాపు 25 శాతానికి చేరుకుందని కేటీఆర్ విమర్శించారు.

kTR
kTR
author img

By

Published : Jul 6, 2023, 1:56 PM IST

KTR Tweet on Central Government Jobs : కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని చేరుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2004 నాటికి కేంద్ర ప్రభుత్వ ఖాళీలు 12.1 శాతం ఉండగా.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముగిసే సమయానికి దాదాపు 11 శాతానికి చేరుకుందని చెప్పారు. కానీ.. మోదీ హయాంలో ఆ సంఖ్య దాదాపు 25 శాతానికి చేరుకుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • Central Govt Jobs Vacancies scaling New peak 👇

    By 2004, that is during the time when "India was shining" the Central Govt vacancy stood at 12.1%

    By the end of "Policy Paralysis & huge corruption charges of Manmohan Singh Govt, the Central Govt Vacancy stood at approximately… pic.twitter.com/9qJlMNs5U9

    — KTR (@KTRBRS) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కొత్త శిఖరాన్ని చేరుకుంటున్నాయి. 2004 నాటికి కేంద్రంలో ఖాళీలు 12.1 శాతం ఉండగా.. అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం ముగిసే సమయానికి దాదాపు 11 శాతానికి చేరుకుంది. తిరిగి మోదీ హయాంలో ఆ సంఖ్య దాదాపు 25 శాతానికి చేరుకుంది.' - ట్విటర్​లో కేటీఆర్

KTR Tweet Today : 'కుమురంభీం కల సాకారమైన వేళ.. గిరిజనులకు పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిది'

KTR Tweet on Telangana Mobility Valley : మరోవైపు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ.. ఆటోమోటివ్ రంగంలో అధునాతన వృత్తిని అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎమ్‌వీలో హ్యుందాయ్‌ మొబిస్, బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ కలిసి.. సరికొత్త 11 నెలల పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిఫికేషన్‌, అటానమస్‌ డ్రైవింగ్‌, కనెక్టెడ్‌ వెహికల్‌, కృత్రిమ మేధా, మెషీన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఈ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సును ప్రవేశ పెట్టినట్లు వివరించారు. హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీలో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హ్యుందాయ్‌ మొబిస్‌లో లైవ్‌ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం దొరుకుతుందని కేటీఆర్ వెల్లడించారు.

  • Very happy to note that our Telangana Mobility Valley (TMV) is creating exciting opportunities for students pursuing advanced careers in the Automotive space

    The TMV, Hyundai Mobis @HyundaiMobisIN and BITS Pilani @bitshyd have jointly created a 11 month “Post Graduate Diploma… pic.twitter.com/pSRJd7tdcN

KTR Today Tweet: 'తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే'

Telangana Mobility Valley : న్యూ మొబిలిటీ రంగంలో అత్యున్నత పరిజ్ఞానం, నైపుణ్యం లభించేలా ఇంజినీర్లను తీర్చిదిద్దడానికి హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటైంది. ఇందుకోసం మొబీస్ ఇండియా, బిట్స్ పిలానీ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. టీహబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఉన్నత ప్రమాణాలతో సురక్షితంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ సెంటర్ దృష్టి సారించనుంది.

అందుకనుగుణంగా ఇంజనీర్లకు తగిన శిక్షణ ఇచ్చి.. ఈ రంగంలో వచ్చే సవాళ్లను ధీటుగా, వినూత్న విధానాలతో ఎదుర్కొనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన మానవవనరుల సముదాయాన్ని తయారు చేయనుంది. ఆటోమోటివ్ నెట్‌వర్క్స్, కమ్యూనికేషన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీ, కనెక్టెడ్ కార్స్ తదితర అంశాల్లో ప్రత్యేక కోర్సులతో పాటు పరిశోధన అవకాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కల్పించనుంది.

ఇవీ చదవండి: KTR on Hyderabad Development : 'మానవ వనరులు, నైపుణ్యానికి రాజధాని హైదరాబాద్'

KTR on Hyderabad Development : 'దేశానికి లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.