KTR, Telangana Assembly Election Results 2023 Live : తెలంగాణలో శాసనసభ ఎన్నికల ఫలితాలు (Telangana Assembly Election Results) ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ అంటుండగా, కాంగ్రెస్, బీజేపీ సైతం గెలుపు తమవైపే ఉందని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం రాష్ట్రంలో హస్తం గాలి వీస్తుందని ప్రకటించాయి. దీనిపై భారత్ రాష్ట్ర సమితి స్పందించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
KTR Tweet on BRS Hattrick Win in Telangana : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులవుతాయని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. 2018 ఫలితాల సమయంలోనూ ఇదే విధంగా జరిగిందని.. ఈసారి కూడా అదే పునరావృత్తం అవుతుందని పునరుద్ఘాటించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) గులాబీ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. హ్యాట్రిక్ లోడింగ్ 3.0 గెట్ రెడీ టు సెలబ్రేట్ అనే క్యాప్షన్‌తో గన్‌తో షూట్ చేస్తున్న ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
Hattrick Loading 3.0 👍
— KTR (@KTRBRS) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
">Hattrick Loading 3.0 👍
— KTR (@KTRBRS) December 2, 2023
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4wHattrick Loading 3.0 👍
— KTR (@KTRBRS) December 2, 2023
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ అంతే - అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి : కేటీఆర్
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన ఇండియా టుడే - ఏ పార్టీకి పట్టం కట్టిందంటే?
'ఎగ్జిట్ పోల్స్‌కు ఎగ్జాట్ పోల్స్‌కు చాలా తేడా ఉంటుంది - 1000 శాతం అధికారం బీఆర్ఎస్దే'