ఇంధన ధరలు పెరుగుదల కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి రోజుకో తరహా వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. దేశ జీడీపీ పెరగడం లేదని.. ఎవరన్నారని.. ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని వెల్లడించారు. జీడీపీ పెరుగుదలను ప్రధాని మోదీ రోజువారీ అలవాటుగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే మోదీ వ్యూహమా అని ట్వీట్ చేశారు. భాజపా నేతలైతే ఖచ్చితంగా మోదీ వ్యూహంగా చెప్తారని వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
దేశ జీడీపీ పెరగడం లేదని ఎవరన్నారు?. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజూ పెరుగుతున్నాయి. జి.డి.పి. పెరుగుదలను ప్రధాని రోజువారీ అలవాటుగా మార్చారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనేది మోదీ వ్యూహమా?. భాజపా నేతలైతే ఖచ్చితంగా మోదీ వ్యూహంగా చెప్తారు.
ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు
ఇదీ చూడండి: కేటీఆర్, డీకే శివకుమార్ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ