ఇవీ చూడండి:వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్: కేటీఆర్
'గల్లీలో మీ సేవకుడు... దిల్లీలో కేసీఆర్ సైనికుడు' - l b nagar
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో పర్యటిస్తూ మర్రి రాజశేఖర్ రెడ్డికి ఓటు వేయాలని సూచించారు.
రోడ్‌షోలో కేటీఆర్
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ పరిధిలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం సాగించారు. ఒకరు చౌకేదార్, మరొకరు టేకేదార్ అంటున్నారు ఇలాంటి వాళ్లు దేశానికి అవసరమా అని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించుకున్న వాళ్ళం... 16 మంది ఎంపీలతో దిల్ల్లీని ఏలలేమా అని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్: కేటీఆర్