40 రోడ్లకు ప్రణాళిక సిద్ధం
మొదటిదశలో 55 స్లిప్ రోడ్లను గుర్తించామని... అవసరమైన భూసేకరణ, నమూనాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే 40 రోడ్లకు అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైందని, 20 రహదారులకు సంబంధించి కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తి చేస్తే నిర్మాణం ప్రారంభించవచ్చని తెలిపారు.
పది కిలోమీటర్ల చొప్పున..
రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతున్నందున పౌరులు సులభంగా గమ్యం చేరేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఎస్సార్డీపీ, సీఆర్ఎంపీ ద్వారా పెద్దఎత్తున మౌలికవసతులు కల్పిస్తున్నామని... కూడళ్లను అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ప్రతి జోన్లో కనీసం పది కిలోమీటర్ల చొప్పున రద్దీగా ఉండే రహదార్ల వెంట ఫుట్ పాత్లు నిర్మించాలని ఆదేశించారు.
హైదరాబాద్ రహదారి అభివృద్ధి సంస్థ చేపడుతున్న పనుల వివరాలను మంత్రి తెలుసుకున్నారు. నగరంలో ఉన్న హైటెన్షన్ వైర్ల కింద రహదార్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: జనవరి 2 నుంచి పల్లెప్రగతికి శ్రీకారం