కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు సంబంధించిన పనులపై పురపాలక మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం, రహదార్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న శ్మశానవాటికలు, పార్కులు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కరీంనగర్, నిజామాబాద్ నగరాల వాటర్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్న మంత్రి కేటీఆర్... నీటి, ఇంధన ఆడిటింగ్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు.
వర్షాకాల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న ఖాళీ స్థలాలతోపాటు పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, అవకాశం ఉన్న ప్రతి చోటా నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించి, ఆదర్శవంతమైన పద్ధతులను పుణికిపుచ్చుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని, కార్పొరేషన్ల పరిధిలో పౌరుల కనీస అవసరాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పురపాలకశాఖ అధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: కరోనా మరణాలకు కారణాలవే.. కట్టడి చేయటం ఎలా?