KTR Reacts on Adilabad Amit Shah Speech : ఆదిలాబాద్ సభలో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) మండిపడ్డారు. రాష్ట్రంలో అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్ని అబద్ధాలాడినా బీజేపీకి ప్రజల తిరస్కారం తప్పదని మంత్రి పేర్కొన్నారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదని ధ్వజమెత్తారు. ఆదిలాబాద్లో అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మంత్రి ఆరోపించారు.
KTR Fires on Amit Shah : నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) మళ్లీ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయమని మంత్రి వ్యాఖ్యానించారు. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షా కుమారుడు క్రికెట్ ఎప్పుడు ఆడారో.. ఆయన దేశ ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదని మంత్రి ఫైర్ అయ్యారు.
Amit Shah Speech in Adilabad BJP Public Meeting : 'డిసెంబరు 3న హైదరాబాద్లో కాషాయ జెండా ఎగురుతుంది'
'అబద్ధాల అమిత్ షా పార్టీకి రాష్ట్రంలో గుణపాఠం తప్పదు. అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలే. అమిత్ షా, మోదీ ఎన్ని అబద్ధాలాడినా బీజేపీకు తిరస్కారం తప్పదు. బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయం. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఒక్క విద్యాసంస్థ ఇవ్వలేదు. మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది.. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతుల్లో ఉంది. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానమన్న అమిత్ షా వ్యాఖ్యలు అసత్యం. రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.' -కేటీఆర్, ఐటీ, పురపాలఖ శాఖ మంత్రి
KTR Comments on BJP Party : పదేళ్లలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను ఇవ్వని పార్టీ బీజేపీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కారు స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని.. బీజేపీ పార్టీ స్టీరింగే అదానీ చేతిలో ఉందని మండిపడ్డారు. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానమన్న అమిత్ షా మాటలు అసత్యమన్నారు. రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే అమిత్ షా అబద్ధాలు చెప్పారని మంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ సీసీఐ ప్రారంభానికి ఐదేళ్ల క్రితం అమిత్ షా ఇచ్చిన హమీకి అతీగతీ లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
KTR Respond to Election Schedule : 'తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. బీఆర్‌ఎస్‌దే..!'