ETV Bharat / state

లైఫ్‌ సైన్స్‌ కాపిటల్​గా హైదరాబాద్‌: కేటీఆర్​ - KTR OPENED MEDTRANIC CENTER

హైదరాబాద్​ నానక్‌రామ్‌గూడాలో మెడ్‌ట్రానిక్ వైద్య పరికరాల ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 11 నెలల్లోనే మెడ్‌ట్రానిక్ కేంద్రం పూర్తిచేయటం హర్షణీయమన్నారు. హైదరాబాద్ మెడికల్ టెక్నాలజీ హబ్‌గా మారుతోందని వివరించారు.

KTR, Medtronic Center
మెడ్‌ట్రానిక్‌ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్​
author img

By

Published : Apr 7, 2021, 10:30 AM IST

Updated : Apr 7, 2021, 11:34 AM IST

మెడ్‌ట్రానిక్ నగరంలో అతిపెద్ద కార్యాలయం నెలకొల్పిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడాలో మెడ్‌ట్రానిక్ వైద్య పరికరాల ఇంజినీరింగ్ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. వైద్య పరికరాల తయారీలో అమెరికా సంస్థ మెడ్‌ట్రానిక్ ప్రసిద్ధి గాంచింది.

లైఫ్‌ సైన్స్‌ కాపిటల్​గా హైదరాబాద్‌: కేటీఆర్​

11 నెలల్లోనే మెడ్‌ట్రానిక్ కేంద్రం పూర్తిచేయటం హర్షణీయమని మంత్రి అన్నారు. లైఫ్‌ సైన్స్ క్యాపిటల్‌గా హైదరాబాద్ బలోపేతమవుతోందని తెలిపారు. వైద్య పరికరాల తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మెడికల్ టెక్నాలజీ హబ్‌గా మారుతోందని వివరించారు. లైఫ్ సైన్స్ మార్కెట్ విలువ 100 బిలియన్లకు చేరేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. 2030 నాటికి మార్కెట్ విలువ 100 బిలియన్లకు చేరేలా ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ మెడ్‌టెక్ ప్రణాళికకు మెడ్‌ట్రానిక్ ఉపయోగమన్నారు.

నానక్‌రామ్‌గూడా బీఎస్​ఆర్ టెక్‌పార్క్‌లో 12 వందల కోట్లతో వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణల కేంద్రాన్ని మెడ్‌ట్రానిక్‌ ఏర్పాటు చేసింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 140 దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్న మెడ్‌ట్రానిక్ సంస్థ..ఆరంభంలో వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. అమెరికా తర్వాత హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్ కేంద్రం ఏర్పాటు చేసింది.

Last Updated : Apr 7, 2021, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.