ETV Bharat / education-and-career

జాబ్​లో ప్రమోషన్ కోరుకుంటున్నారా? - ఈ బుక్​లోని సూత్రాలు పాటించండి చాలు! - THE DECISION BOOK

ది డెసిషన్‌ బుక్‌లోని 4 ప్రధాన విభాగాలు - కీలక నిర్ణయాలకు ఉపకరించే సూత్రాలు

The Decision Book
The Decision Book (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 5:00 PM IST

The Decision Book Summary : క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో జాబ్​లో చేరిన కొత్తల్లో ట్రైనింగ్​లో భాగంగా 'డెసిషన్‌ మేకింగ్‌ మోడల్స్‌' కొన్నిటిని నేర్పిస్తారు. అన్నిటికన్నా ముందు అత్యవసరంగా చేయాల్సిన ముఖ్యమైన వర్క్​ను పూర్తి చేసి, ఆ వరుసలో చివరగా అత్యవసరం కాని సాధారణ పనులను ఇతరుల చేత సావకాశంగా చేయించుకోమని చెప్తారు. అలాంటి డెసిషన్‌ మేకింగ్‌ మోడల్స్‌ మన నిర్ణయాలను ప్రభావితం చేసి, పనితనాన్ని మెరుగుపరిచే దిశగా తీసుకువెళతాయి. ఈ విషయంలో రోమన్‌ షాపెలర్‌, మైకేల్‌ క్రొగెరస్ రాసిన పుస్తకం ది డెసిషన్‌ బుక్‌. దీనిలో మొత్తం 50 నిర్ణయాలను నిర్దేశించే మోడల్స్‌ని సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా రచయితలు అందించారు.

ఇందులో చెప్పిన అంశాలను పెద్ద శ్రమ పడకుండా ఆచరణాత్మకంగా ఎలా చేయాలో చెప్పే విధానం ది డెసిషన్‌ బుక్‌’ ప్రత్యేకత. ఈ బుక్​లో ఇచ్చిన మోడల్స్‌ వ్యక్తిగత అభివృద్ధికీ, వ్యూహాత్మక ఆలోచనలకూ ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్‌ నిర్వహణకు ఏ అంశాలను పరిగణిస్తే నిర్ణయాలు మెరుగైన ఫలితాలకు దారితీస్తాయో రచయితలు వివరించారు.

ది డెసిషన్‌ బుక్‌లోని 4 ప్రధాన విభాగాలు : -

  • మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరచుకోవాలి
  • ఎలా మెరుగ్గా అర్థం చేసుకోవాలి
  • ఇతరులను ఎలా మెరుగ్గా అర్థం చేసుకోవాలి
  • ఇతరులను ఎలా మెరుగుపరచాలి అనేవి

కెరియర్‌ ప్లానింగ్, వ్యక్తిగత అభివృద్ధి : -

ఐసెన్‌ హోవర్‌ మ్యాట్రిక్స్‌ : సమయ నిర్వహణ కోసం పనులను వాటి అవసరం, ప్రాముఖ్యాలను అనుసరించి పూర్తి చేసుకోవాలి. ఇది ఉద్యోగ వేట, వ్యక్తిగత జీవితం, నైపుణ్య అభివృద్ధి - ఈ మూడిటి మధ్య సమతుల్యానికి విలువైన మోడల్‌.

పర్సనల్‌ పర్ఫార్మెన్స్‌ మోడల్‌ : రోజు మొత్తంలో కొన్ని సమయాల్లో చురుకుగా, కొన్ని సమయాల్లో అలసటతో నీరసంగా ఉంటాం. ఆసక్తి, శక్తిలో ఉండే ఈ ఎగుడుదిగుడులను గుర్తించడంలో ఈ మోడల్‌ సహాయం చేస్తోంది. నూతన విషయాలను నేర్చుకునే టైంనీ, చేయాల్సిన పనులను ఏ వరుసలో చేస్తే ప్రభావవంతంగా ఉంటుందో సూచిస్తోంది.

పోర్ట్‌ ఫోలియో కెరియర్‌ మోడల్‌ : వైవిధ్యమైన కెరియర్‌ పోర్ట్‌ ఫోలియోను సృష్టించడానికి వివిధ నైపుణ్యాలూ, అనుభవాలను మ్యాపింగ్‌ చేయడంలో సహాయం చేస్తోంది.

అత్యంత ప్రభావశీలమైన (తక్కువ నిడివి ఉండి, ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే) పాఠాలపై దృష్టి సారించడానికి ‘పరేటో సిద్ధాంతాన్ని’ (80/20 నియమం) వినిపయోగించాలి.

కెరియర్‌ ప్లానింగ్‌ : -

  • మేజర్‌, మైనర్‌ సబ్జెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు లేదా ఉద్యోగ ఆఫర్‌ల ఎంపికకు ‘డెసిషన్‌ ట్రీ’ ఉపయోగకరం
  • సాధించదగిన విద్య, కెరియర్‌ లక్ష్యాలను రూపొందించుకోవడానికి ‘గోల్‌ సెట్టింగ్‌ మోడల్‌’ ప్రయోజనకరం

నాయకత్వ లక్షణాల అభివృద్ధి : -

లీడర్‌షిప్‌ స్టైల్స్‌ మోడల్‌ : టీమ్‌ ప్రాజెక్ట్‌లను నడిపించడానికి వివిధ విధానాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది

డెలిగేషన్‌ మోడల్‌ : గ్రూప్‌ వర్క్‌ని సమర్థంగా నిర్వహించడంలో ఈ బుక్​ సహాయపడుతుంది

ఆచరణాత్మక చిట్కాలు :-

చిన్న స్థాయిలో : ముందుగా చిన్న చిన్న అంశాల్లో ఈ మోడల్స్‌ను వాడుకొని అవి ప్రభావవంతంగా వర్క్​ చేస్తున్నాయని తెలుసుకున్నాక పెద్ద స్థాయి అంశాలలో ఈ మోడల్స్‌ను వాడుకోవచ్చు.

అనువుగా మార్చుకోవాలి : మీరు ఉన్న సందర్భానికీ, పరిస్థితికీ తగినట్లుగా మోడల్స్‌లో సర్దుబాటు చేయాలి. సంక్లిష్టమైన నిర్ణయాలను ఎదుర్కొనేటప్పుడు వివిధ రకాల మోడల్స్‌ను కలపాలి.

నోట్‌ చేసుకుని సమీక్షించాలి : వివిధ మోడల్స్‌ వినియోగించిన సందర్భాలను ఒక పుస్తకంలో నోట్‌ చేసుకోవాలి. ఫలితాల ఆధారంగా మీ విధానాన్ని సమీక్షించి సర్దుబాటు చేయాలి.

మీ జట్టులో అమలు : మీ బృందం ప్రాజెక్టుల్లోనో, కంబైన్డ్‌ స్టడీ చేసే మీ జట్టులోనో ఈ మోడల్స్‌ని ఉపయోగించాలి. వివిధ దృక్కోణాలను పొందడానికి మీ మిత్రులతో మోడల్స్‌ను పంచుకొని చర్చించాలి. ఈ పుస్తకం విద్య, వృత్తి పరంగా కీలకమైన నిర్మాణాత్మక ఆలోచనలకూ, నిర్ణయాత్మక నైపుణ్యాల అభివృద్ధికీ టూల్‌ కిట్‌గా పని చేస్తుంది.

నిర్ణయాలు తీసుకోవడమనేది చాలా క్లిష్టమైన విషయం. ఈ ది డెసిషన్‌ బుక్‌ ఆ ప్రక్రియను సులువైన ఆచరణాత్మక సోపానాలుగా విడగొట్టి ఇస్తుంది. మంచి ముందడుగును అందిస్తుంది. మన నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. మన నిత్య జీవితంలో నిర్ణయాలు తీసుకునేందుకు ఇందులో ఇచ్చిన మోడల్స్‌ను సందర్భానుసారం మార్చుకొని ఉపయోగించడం కీలకం. - రహ్మాన్‌

రూ. 50వేల జీతంతో ఎయిర్​ఫోర్స్​లో ఉద్యోగాలు - జనవరి 29 నుంచి ర్యాలీ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.