ETV Bharat / state

KTR on Women Welfare Celebrations : 'ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశం' - మంత్రి కేటీఆర్ టుడే ట్వీట్

KTR Tweet on Women Welfare Celebrations : తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ.. యావత్ దేశానికే ఆదర్శమని అన్నారు. ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశమని.. సంక్షేమంలో సగం కాదు.. 'ఆమే' అగ్రభాగమని వ్యాఖ్యానించారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి.. ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కేసీఆర్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుతోందని తెలిపారు.

KTR on Women Welfare Celebrations
KTR on Women Welfare Celebrations
author img

By

Published : Jun 13, 2023, 12:58 PM IST

Women Welfare Celebrations in Telangana : మహిళా సంక్షేమంలో మన తెలంగాణ రాష్ట్రం.. యావత్ దేశానికే ఆదర్శమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వరుస ట్వీట్స్‌ చేశారు. ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశమని.. సంక్షేమంలో సగం కాదు.. 'ఆమే' అగ్రభాగమని వ్యాఖ్యానించారు. అప్పుడే పుట్టిన ఆడ బిడ్డ నుంచి.. ఆరు పదులు దాటిన అవ్వల వరకు.. అందరినీ కేసీఆర్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుతోందని తెలిపారు.

  • గర్భిణీలకిచ్చే న్యూట్రిషన్ కిట్లు
    ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులు

    ఆడబిడ్డ పుట్టిందంటే...
    ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే...

    కేసిఆర్ కిట్ తోపాటు అందే 13 వేలు..
    ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు

    లక్ష్మీ కటాక్షమే కాదు...
    తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం… pic.twitter.com/Up7MqayVTE

    — KTR (@KTRBRS) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Minister KTR Today Tweet : ఈ క్రమంలోనే రాష్ట్రంలో గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్లు.. ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులని కేటీఆర్ పేర్కొన్నారు. ఆడబిడ్డ పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టినట్లే అన్న ఆయన.. కేసీఆర్ కిట్‌తో పాటు అందే రూ.13 వేలు.. ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలని వ్యాఖ్యానించారు. లక్ష్మీ కటాక్షమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతీ కటాక్షం కూడా ఉందని, కార్పొరేట్‌కు దీటైన గురుకులాలతో తల్లిదండ్రుల కలలు సాకారం అవుతున్నాయని తెలిపారు. ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన 'షీ-టీమ్' ఓ సంచలనమని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే 'వీ-హబ్'.. ఓ సంకల్పమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

  • షీ టీమ్‌.. ఓ సంచలనం
  • వీ హబ్‌.. ఓ సంకల్పం
  • కల్యాణలక్ష్మి.. ఓ విప్లవం
  • కల్యాణలక్ష్మి కేవలం పథకంకాదు... ఒక విప్లవం
    ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్..
    మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్..
    ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా
    పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ
    సీఎం కేసిఆర్ గారు...

    గుక్కెడు మంచినీళ్ల కోసం
    మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను…

Telangana Decade Celebrations 2023 : స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఓ నవశకం అన్న కేటీఆర్.. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఓ ప్రోత్సాహం అని పేర్కొన్నారు. ప్రతి బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ ఓ గొప్ప సంప్రదాయమని తెలిపారు. కల్యాణలక్ష్మి కేవలం పథకం కాదని.. ఒక విప్లవం అన్న ఆయన.. ఓవైపు బ్రూణ హత్యలకు బ్రేక్ పడిందని, మరోవైపు బాల్య వివాహాలకు ఫుల్ స్టాప్ చెప్పినట్లైందని అన్నారు. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా అన్న మంత్రి... పది లక్షలకు పైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను.. మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.

  • అక్కాచెల్లెళ్లకు అన్నలా..
  • ఒంటరి మహిళలకు తండ్రిలా..
  • ఆడబిడ్డలకు మేనమామలా..
  • కొండంత అండగా సీఎం కేసీఆర్

కొండంత అండగా సీఎం కేసీఆర్‌..: అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసిన సందర్భమన్న కేటీఆర్.. దేశంలోనే అత్యధిక పారితోషికాలతో, గౌరవప్రదంగా జీవించే గొప్ప అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆడబిడ్డల సంక్షేమంలో ఎదురులేదని, మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగులేదని అన్నారు. అమ్మ ఒడి వాహనమైనా, ఆరోగ్య లక్ష్మి పథకమైనా, నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హర్షం అని ట్వీట్ చేశారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా, ఆడబిడ్డలకు మేనమామలా, అవ్వలకు పెద్ద కుమారుడిలా కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మహిళాలోకం మనసారా ఆశీర్వదిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యావత్ మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి..

అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు.. కేసీఆర్ : కేటీఆర్

KTR Today Tweet: 'తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.